జ్యోతిర్ మ‌ఠాధిప‌తి వాసుదేవానంద స‌ర‌స్వ‌తి ప్రవచనాలతో తరించిన హిందువులు
ఒక్కరు చాలు.. ఇద్దరు వద్దు అని దేశమంతా మొత్తుకుంటుంటే ఈ స్వాములోరు మాత్రం అలా వద్దు కంటే పది మందికి తక్కువ కాకుండా కనండి అని హితబోధ చేస్తున్నారు.
వాళ్ల పోషణ గురించి అసలే ఆలోచించవద్దు... దేవుడే ఆ పని చూసుకుంటాడని సెలవిచ్చారు.
జ్యోతిర్ మఠాధిపతి వాసుదేవానంద సరస్వతి అనే సాధువు గారు ఇటీవల నాగపూర్ కు వచ్చారు. అక్కడ ధర్మ సంస్కృతి మహాకుంభ సమ్మేళనంలో పాల్గొని భక్తులకు ఈ గొప్ప తత్వాన్ని భోధించారు.
అంతేకాదు.. ఇంటికి ఇద్దరు పిల్లలు అన్న నినాదాన్ని ఇకపై వదిలేయాలి. ఒక్కోరు పది మందిని కనాలి అప్పుడే దేశం హిందుతత్వంతో నిండుదనం సంతరించుకుంటుందని ప్రకటించారు.
మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్, అస్సాం గవర్నర్ భన్వరిలాల్ పురోహిత్ తదితరులు కూడా స్వామిజీ ప్రవచనాన్ని శ్రద్ధగా ఉన్నారు. కానీ, ఎవరూ కూడా ఆయన వ్యాఖ్యలపై అభ్యంతరం వ్యక్తం చేయలేదు.
