మహిళలను కించపరిచేలా రూపొందించిన ఈ కోలా యాడ్  వీడియో ఇండియానూ  తాకుతోంది.

సరుకులో సత్తా ఉన్నా సరైన పబ్లిసిటీ లేకపోతే దుకాణం మూసుకోవాల్సిందే. అందుకే ఇంటర్నేషనల్ కంపెనీల నుంచి ఇంటి ముందు పచారీ కొట్టు కూడా ప్రచారం కోసం నానా కష్టాలు పడుతుంటాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

పెన్ను నుంచి గన్ వరకు ఏది అమ్మాలన్నా పబ్లిసిటీనే ఆక్సిజన్. అందుకే చాలా కంపెనీలు కోట్లు పెట్టి యాడ్ కంపెనీలతో ప్రత్యేక ప్రకటనలు రూపొందించుకుంటుంది.

అయితే ఒక్కోసారి ఇలాంటి ప్రకటనలు వివాదాస్పదం అవుతుంటాయి. ఇలాంటి కోవలోకి వచ్చేసింది కోకాకోలా తాజాగా రూపొందించిని ఈ యాడ్.

మహిళలను, స్వలింగసంపర్కులను కించపరిచాలా రూపొందించిన ఈ యాడ్ ఇప్పుడు యూట్యూట్ లో వైరల్ గా మారింది.

అమెరికాలో కూడా ఈ యాడ్ టెలికాస్ట్ అవుతోంది. అక్కడి కల్చర్ కి ఇదే బాగానే కనెక్ట్ అయిందేమో... కానీ, ఇండియాలో పరిస్థితి అలా కాదు.

అసలే తమిళనాడులో ఈ కూల్ డ్రింక్ ను నిషేధిస్తూ కొన్ని వ్యాపారసంస్థలు ఏకగ్రీవంగా తీర్మానించాయి. ఇప్పుడు ఈ యాడ్ కూడా దానికి తోడైతే కోలా పరిస్థితి ఏంటో...?