గోళ్ల రఘు గోక్కొచ్చిన అవినీతిసొమ్మును దాచేందుకు బినామీలను, న్యాయసలహాదారులను, అడిటర్లను నియమించుకుని ఒక వ్యవస్థ ఏర్పాటుచేసుకున్నాడు.ఒక అధికారి దగ్గిర ఇలా 500 కోట్ల పైబడి అక్రమ సొమ్ము కనిపించడం భారత దేశంలో నే మొదటి సారి అని అధికారులు చెబుతున్నారు

రఘు అవినీతి గోళ్లు చాలా పదను

ఈ మనిషి చూస్తే పూర్వకాలపు బతక లేని బడి పంతుల్లాగా కనబడతాడు. ఈ పోటోలో కనిపించకుండా ఉండా చెేతులకు రంపపు పళ్లకంటే పదునైన గోళ్లన్నాయి. మనిషి అవినీతిబకాసురుడు.

రెండు మూడు రోజులు గోళ్ల వెంకటరమణా రెడ్డి అనే అవినీతి చక్రవర్తి తెలుగు రాష్ట్రాలను వూపేస్తున్నారు. ఉద్యోగంలో చేరినప్పటినుంచి ఆయన గోళ్లకు అవినీతి సాన పడుతున్నట్లే వున్నాడు. లేకపోతే ఇంత పెద్దమొగోడెాలావుతాడు. అయితే, విచిత్రమేమిటంటే, ఆయన అవినీతి విషయం బయటపడేందుకు మూడు దశాబ్దాలపైగా పట్టింది. ఆయన విశాఖ లో పనిచేస్తున్నపుడు, జిహెచ్ఎంసి లో పెరిగి పెద్ద వాడవుతున్నపుడు ఇపుడు అంధ్ర రాష్ట్ర మేర్పడిన తర్వాత అక్కడ ఒకటే గోళ్లతో గోకుడు మొదలుపెట్టినా అవినితి నిరోధక శాఖ అధికారులకు గోళ్ళ ఆనవాళ్లు కూడా దొరకలేదు. సరే, ఇపుడయినా పట్టుకున్నారని సంతోషించినా, ఇంతకాలం గోళ్ల అవినితి గురించి ఫిర్యాదులే రాలేదా.వచ్చినా పట్టించుకోలేదా? లేక ఆయన అవినీతి ఎక్కడ జరిగినా చక్కగ కాపాడిన వారున్నారా? అనే ప్రశ్నలెదురవుతాయి. ఆయన తెచ్చిన దొంగసొమ్ము కచ్చింతంగా పై దాకా షేర్ అవుతూ ఉంటుంది. ఎవరివాటా వారికి వెళ్తూ వుంటుంది. కాబట్టి ఇంత గొప్పగోళున్న వ్యక్తిని ఎంత మంది మంత్రులు, ఐఎ ఎస్ అధికారులు కాపాడుతూ వచ్చారో... ఈ విషయాల్లోకి దర్యాప్తులు వెళ్లే అవకాశమేలేదు. కాబట్టి ఇలాంటి వాళ్లు ఎంతమంది తప్పించుకుని పోయారో, ఇంకా ఎంతమంది దాక్కుని ఉన్నారో... లెక్కలు తీయడం సాధ్యం కాదు. ప్రభుత్వం లో ఉండే ప్రతిపెద్దాయనకు ఒకరో ఇద్దరో ముగ్గురో ఇలాంటి గోళ్ల బ్రోకర్లుంటారని ఒక సీనియర్ అధికారి చెప్పారు. అందుకే, ఆ ఆధికారి లేదా ఆ మంత్రి ఎపుడు శాఖ మారినా ఆ బ్రోకర్ ను వెంటసుకునే వెళుతుంటారట. ఎపుడూ ఆమె లేదా అతనే సార్ గారి పర్సనల్ వ్యవహారాలన్నీ చూస్తుంటారు. ఈ లెక్కన సెక్రెటేరియట్ గదుల్లో మినిష్టర్ల ఛేంబర్ల లో ఎంతమంది బ్రోకర్ అధికారులు, బినామీలు దాక్కుని ఉంటారో లెక్కేలేదు. సెక్రెటేరియట్, అక్కడి ఆఫీసులు, చివరకు మన ప్రభుత్వాలన్నీ మేడిపండ్లే... సరే అసలువిషయానికొస్తే, ఎసిబికి దొరికిన రఘరామిరెడ్డి గారి గోళ్ల గురించి చాలా ఆసక్తి కరమయినవిషయాలు వెళ్లడువుతున్నాయి. కొన్ని విషయాలు:

**భారత దేశంలో అవినీతి కింద పట్టుబడిన ఏ అధికారికి (సీనియర్ ఐ ఎఎస్ లతో సహా) లేనంత సంపద అంటే 500 కోట్ల పైనే ఆస్తులు గోళ్ల వెంకటరఘరామిరెడ్డి దగ్గిర దొరికాయి..

**రఘరామిరెడ్డి గోళ్లతో గోకేసిందంతా ఎవరికి తెలియకుండా మొత్తం బినామీలోతోనే నడిపించాడు.

**ఆయన అక్రమాస్తులలో 80 శాతం అంతా బినామీలో చేతిలో ఉన్నాయట

**బినామీలలో మహిళలు కూడా ఉన్నారు.

**బినామీలు ముంచేయకుండా ఉండేందుకు వారికి ఉదారంగానే వాటా ఇచ్చేవాడట. అది 30 శాతం పైగానే ఉందని ఎసిబి అధికారుల అనుమానం.

**గోళ్ల వారి ఇంట్లో దొరికిన దొంగసొమ్ము కంటే, ఆయన బినామీ నల్లూరు శివప్రసాద్ (గన్నవరం దగ్గిర చిన్న అవుటూరు) ఇంట్లో దొరికిన బంగారు, నగదు, డాక్యమెంట్లు ఎక్కువని ఎసిబి తాజా సమాచారం.

**ఆయన కు బినామీలు లేని జిల్లాలు లేవు. చాలా చోట్ల మొగుడు పెళ్తాలిద్దరిని బినామీలు నియమించకున్నాడు.

**ఈ బినామీ ల నియమాకంలోనూ ఆయన న్యాయ సలహాలను, ఆడిటర్ల సలహాలను తీసుకునేవారు.

**ఇక అయన భార్య దగ్గిర ఉన్నది కేవలం 200 గ్రాముల బంగారు. ఇక కూతురు పేర కనిపించింది చిత్తూరు జిల్లలో రెండెకరాల భూచెలక మాత్రమే.

**బినామీల ఎంపికలో ఆయన బంధువులను దూరంగా ఉంచేవారు.

**మినిమమ్ పది లక్షలకు లంచం లేకుండా ఇంటికెళ్లే వాడు కాదు. అనుమానం వస్తే బ్లాంక్ చెక్కులు తీసుకుని బెదిరించే వాడు.

**కొన్ని సందర్భాలలో ఆయన ఈ దొంగసొమ్ముతో బోగస్ కంపెనీలు ఏర్పాటుచేసి, వాటాలు కొనేవాడు. కార్పొరేట్ ఘరానాలు చేసిన పనులివి.

**ఇప్పటి విశేషాలివి... ఇంకా ఎన్ని బయటకొస్తాయో చూద్దాం.