దసరా నవరాత్రలు ప్రారంభమయ్యాయి. దేశ వ్యాప్తంగా జరుపుకునే అతి పెద్ద పండుగ దసరా. చెడుపై మంచి విజయం సాధించిన రోజుకు సాక్ష్యంగా విజయదశమిని జరుపుకుంటారు. ఈ రోజే.. రాముడు రావణాసురుడిని అంతమొందించి.. రావణుడి చెర నుంచి సీతను విడిపించాడు. ఇదే రోజున పాండవులు.. కౌరవుల మీద యుద్ధం గెలిచారు. అందుకే ఈ విజయదశమికి ప్రధాన్యత ఎక్కువ. 9రోజుల పాటు నవరాత్రి వేడుకలు జరిపి.. పదవ రోజు దసరాను జరుపుకుంటారు.

 ఇంత ప్రాముఖ్యత గలిగిన ఈ నవరాత్రి రోజుల్లో.. మనలో చాలా మంది తెలియకుండానే కొన్ని తప్పలు, పొరపాట్లు చేస్తుంటారు. అసలు ఎలాంటి తప్పులు చేయకూడదో ఇప్పుడు తెలుసుకుందాం..

1. జుట్టు కత్తిరించడం..

దసరా నవరాత్రలకు చాలా విశిష్టత ఉంది. దుర్గాదేవిని ప్రసన్నం చేసుకునేందుకు ఈ తొమ్మిది రోజులపాటు పూజలు నిర్వహిస్తారు. కాబట్టి.. ఈ నవరాత్రి వేళల్లో.. జుట్టు కత్తిరించకూడదు. అలా చేస్తే.. దుర్గా దేవికి కోపం తెప్పించినవారమౌతామట. మరీ అంతగా అవసరమైతే షేవింగ్ చేసుకున్నా పర్లేదు కానీ.. .జుట్టు మాత్రం కత్తిరించకూడదు. పిల్లలకు కూడా గుండు చేపించడం లాంటివి చేయకూడదు.

 2. కలశం, అఖండ ద్వీపం..

ఈ నవరాత్రి రోజుల్లో.. మనలో చాలా మంది అమ్మవారికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. ఇంట్లో కలశం ఏర్పాటు చేయడం, అఖండ జ్యోతి వెలిగించడం లాంటివి చేస్తారు. వీటిని చేస్తే..చాలా శ్రద్దగా చేయాలి. లేకపోతే అసలు చేయకుండా అయినా ఉండాలి అంతేకానీ.. పేరుకి చేసామంటే చేశామనే విధంగా చేయకూడదు. కలశాన్ని ఏర్పాటు చేసినదగ్గర నుంచి అంది కింద పడకుండా చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఇక అఖండ ద్వీపం విషయానికి వస్తే.. అది ఎల్లప్పుడూ వెలుగుతూ ఉండేలా చూసుకోవాలి. అంతేకాకుండా ఇంట్లో అఖండ ద్వీపం వెలిగించినప్పుడు రాత్రి వేళల్లో ఇంటి సభ్యులు ఎవరో ఒకరు నిద్ర పోకుండా లేచి ఉండాలి.

 3. మాంసాహారం..

ఈ తొమ్మిది రోజులపాటు మాంసాహారానికి దూరంగా ఉండాలి. అంతేకాదు అల్లం, వెల్లుల్లి, ఉల్లిపాయలను కూడా వాడకుండా ఉండటం మంచింది. ఈ నవరాత్రి రోజుల్లో.. నిమ్మకాయని కోయడం కూడా అశుభంగా పరిగణిస్తారు. కనుక మరీ అవసరమైతే నిమ్మకాయ రసాన్ని బయట మార్కెట్ నుంచి తెచ్చుకోండి.

 4. నిద్ర పోవడం...

దసరా నవరాత్రులకు చాలా మంది ఉపవాస దీక్ష చేస్తుంటారు. ఉపవాసం చేస్తే ఎవరికైనా కాస్త నీరసంగానే ఉంటుంది. దీంతో వాళ్లు.. మధ్యాహ్నం సమయంలో నిద్రపోవడం లాంటివి చేస్తుంటారు. అయితే.. ఉపవాస దీక్ష చేస్తున్నవాళ్లు.. పగటి పూట నిద్రపోకూడదట. ఒక వేళ నిద్రపోతే ఎంతో కష్టపడి చేసిన ఉపవాస దీక్షకు ఫలితం లేకుండా పోతుంది.

 5. మితంగా ఆహారం..

ఈ తొమ్మిది రోజులపాటు అమ్మవారికి పూజలు చేసేవారు.. ఒకే సారి కడుపునిండా తినకుండా.. ఆకలి వేసినప్పుడు.. కొద్ది కొద్దిగా ఎక్కువ సార్లు ఆహారం తీసుకుంటే మంచింది. సాధారణ రోజుల్లో తిన్నట్టుగా కాకుండా మితంగా తీసుకోవాలి.

6. మంచినీరు...

ఉపవాస దీక్ష చేస్తున్నా సరే .. మంచినీరు మాత్రం ఎక్కువగా తీసుకోవాలి. లేకపోతే డీ హైడ్రేట్ అయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి.. మంచి నీరు ఎక్కువగా తీసుకుంటూ ఉండాలి. దీనికి బదులు నిమ్మకాయ నీళ్లు, కొబ్బరి నీళ్లు, పండ్ల రసాలు కూడా తీసుకుంటే మంచిది.

7. వేపుడు పదార్థాలు..

చాలా మంది ప్రజలు.. ఈ నవరాత్రి రోజుల్లో ప్రతి రోజూ తీసుకునే పరాటా, వైట్ రైస్, బ్రెడ్ లాంటివి తినకూడదు అనుకుంటారు. కానీ.. అవి తినవచ్చు. కాకపోతే.. నూనెలో ఎక్కువగా వేయించిన పదార్థాలకు దూరంగా ఉంటే సరిపోతుంది. అంతేకాకుండా పైన చెప్పిన పదార్థాలను పరగడుపున మాత్రం తీసుకోకూడదు. దాని వల్ల గ్యాస్ సమస్య తలెత్తే అవకాశం ఉంది.

 8. కూరగాయలు..

ఉపవాసం చేస్తున్నాం కదా.. మనం కూరగాయలు తినకూడదు అనే భ్రమలో చాలా మంది ఉంటారు. అలా ఏమీ లేదు.. ఆలుగడ్డ, టమాట, పనీర్, సొరకాయ లాంటివి తీసుకోవచ్చు. ముఖ్యంగా సగ్గు బియ్యంతో తయారు చేసిన ఆహారాన్ని కూడా తీసుకోవచ్చు.

9. అమర్ నాథ్..

 ఈ నవరాత్రి రోజుల్లోనే కాకుండా మాములు సమయాల్లో కూడా ఈ అమరనాథ్ ఆహారాన్ని తీసుకుంటే చాలా మంచిది. దీనిని తోటకూర గింజలతో తయారు చేస్తారు. వీటిని పాలతో కలిపి తయారు చేస్తే చాలా రుచిగా ఉంటుంది. ఇందులో ప్రోటీన్లు ఎక్కువగా ఉంటాయి. పెరుగు, రైతాతో కలిపి తీసుకుంటే కూడా బాగుంటుంది.

10. కుట్టు

కుట్టు కా ఆటా( నల్ల గోధుమ పిండి) దీనితో తయారు చేసిన పదార్థాలు తీసుకుంటే చాలా ఆరోగ్యంగా ఉండవచ్చు. చాలా మంది వీటి బదులు పూరీ చేసుకోవచ్చుకదా అని భావిస్తారు. కానీ పూరీ కంటే కూడా కుట్టు చాలా మంచిది. ఇందులో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి.

11.సమక్ రైస్..

కేవలం నవరాత్రి దినాల్లోనే కాకుండా మాములు రోజుల్లో కూడా ఈ సమక్ రైస్ తినవచ్చు. అన్నం తినడానికి ఇష్టపడేవాళ్లు మాములు రైస్ కాకుండా ఈ సమక్ రైస్ ని ఎంచుకొని దానిలో కొన్ని రకాల కూరగాయలతో కలిపి వండుకొని తింటే చాలా టెస్టీగా, హెల్దీగా ఉంటుంది.

 12. ఫాక్స్ నట్స్...

ఇవి చాలా టెస్టీగా ఉంటాయి. స్నాక్స్ లాగా తీసుకోవచ్చు. చాలా ఆరోగ్యకరం కూడా. వీటిని కొద్దిగా నెయ్యి వేసి వేయించుకొని  ఉప్పు వేసుకొని తింటే చాలా బాగుంటాయి.

 13. తేనె..

ఉపవాసం చేస్తున్న సమయంలో స్వీట్లు తినడం మంచిది కాదు. వాటిల్లో పంచదార ఉంటుంది అది ఆరోగ్యానికి అంత మంచిది కాదు. అందుకే వాటికి బదులు బెల్లం, తేనెను తీసుకోవచ్చు. ఆరోగ్యపరంగా ఇవి ఎలాంటి హానీ చేయవు.