Asianet News TeluguAsianet News Telugu

( వీడియో) ప్లాస్టిక్ రైస్ ఎలా తయారు చేస్తారో తెలుసా...

చైనా నుంచి భారీ స్థాయిలో ఇండియాకు ప్లాస్టిక్ రైస్ దిగుమతి అవుతోంది.

the making of plastic rice

మేడ్ ఇన్ చైనా అంటే చాలు ఎగబడి కొనేస్తుంటాం... మనకున్న ఈ వీక్ పాయింటనే చైనా వాళ్లు బాగా క్యాష్ చేసుకుంటున్నారు. తక్కువ ధర అని ఆశ చూపి భారత్ మార్కెట్ ను తమ వస్తువులతో కొల్లగొడుతున్నారు. 

 

ఫోన్ ల నుంచి పండ్ల వరకు దేశంలో అన్నీ ఇప్పుడు చైనా తయారీనే కనిపిస్తున్నాయి. వారంటీ, గ్యారెంటీ లేకపోయినా ధర తక్కువ అనే ఒకే ఒక కారణంతో చైనా వస్తువులను తెగ వాడుతున్నాం. ఇదే అదునుగా వాళ్లు అన్నింటిని కల్తీ చేయడం మొదలు పెడుతున్నారు.

 

ఇటీవల హైదరాబాద్ తో పాటు పలు పట్టణాల్లో ప్లాస్టిక్ రైస్ వార్తలు వెలుగు చూశాయి. కొన్ని సూపర్ మార్కుట్ లలో ప్లాస్టిక్ రైసు బ్యాగులు బయటపడ్డాయి. అయితే సూపర్ మార్కెట్ ల వ్యాపారం దెబ్బతీసేందుకే ఇలాంటి రూమర్లు తీసుకొచ్చారని చాలా మంది భావించారు.

 

కానీ, ప్లాస్టిక్ రైస్ తయారీ సాక్ష్యాలు, చైనా నుంచి  ఇండియాకు ఆ బియ్యం దిగుమతి అవుతున్న తీరు నెమ్మదిగా వెలుగులోకి వస్తోంది.

 

అచ్చం బియ్యాని పోలి ఉండే ప్లాస్టిక్ రైస్ ను కలిపి ఇండియన్ మార్కెట్లోకి చైనా వదులుతోంది. అలా ప్లాస్టిక్ బియ్యాన్ని చైనా ఎలా తయారు  చేస్తోందో ఈ వీడియో చూస్తే తెలుస్తోంది.

 

 

చైనా చేస్తున్న ఈ కల్తీ వ్యాపారం పై ఇప్పటికే  ఢిల్లీ  హైకోర్టులో పిల్  దాఖలు అయింది. ఢిల్లీకి చెందిన లాయర్  సుగ్రీవ దుబ్రే...  చైనా నుంచి ఇంపోర్ట్ అవుతున్న రైస్ సాంపిల్స్ పరిశీలించి వాటి నిషేధంపై చర్య తీసుకొనేలా కేంద్రాన్ని ఆదేశించాలని కోర్టును కోరారు.

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios