ఈ రోజుకూ ఆ డిల్లీ St.Stephen's, Sriram, Lady Sriram నుంచి మన south లో చెన్నై Loyola,s\Stella Marys, Hansraj...బెంగుళూరు క్రిస్ట్, సెయింట్ జోసెఫ్, మౌంట్ కార్మెల్ కాలేజీల్లా తెలుగు రాష్ట్రాల్లో ఒక్కటయినా లెగసీ మెయింటెన్ చేస్తున్నాయా? అంతెందుకు..ఇండియా టుడే యాన్యువల్ సర్వే లో ప్రతి రంగంలో ఉన్న టాప్ 10 కాలేజీల లో ఒక్కటన్నా మన తెలుగు రాష్ట్రాలవి వున్నాయా? అయినా కార్పరేట్ వెర్రి ఇంటింటా ముదిరిపోయింది.
గొర్రెల పెంపకం...మీ తరపున గొర్రెలను పెంచుతాము...ఇన్నేళ్లకు ఇన్ని అవుతాయి..పెట్టుబడి పెట్టండి..మీ పెట్టుబడీ గొర్రెసంతతిలా పెరుగుతుంది. కుందేళ్ల పెంపకం... ఈక నుంచి తోక దాకా లాభాలు తెచ్చే ఈమూ పక్షుల పెంపకం.. టేకు వనాలు పెంచుతున్నాం...20 ఏళ్లకు మీ పెట్టుబడి ఆ చెట్టుకున్న ఆకుల్లా వృద్ధి చెందుతుంది. శ్రీగంధం చెట్లు... ఈ సారి శ్రీగంధం చెట్లే...కాకుంటే టిష్యూ కల్చర్ తో పెంచబోతున్నాం... మీ కలలు సాకారం చేసుకోండి...అద్భుతమైన ఇల్లు 2 టేకు చెట్లు,ఒక గంధం చెట్టు.... ఇవేనా? ఆయిల్ పుల్లింగ్ అంటూ పుస్తకాలు... ఏదొచ్చినా తెలుగోళ్లదో ఉన్మాదం,వేలంవెర్రి... ఇక చదువుల సంగతో?ప్రత్యేకంగా చెప్పాలా? ఒక ఊరిలో ఒక డిగ్రీ కాలేజ్ ఉంటే మూడు ఇంజనీరింగ్ కాలేజ్‌లు... అసలు ఇంజనీర్ కాకుంటే బతగ్గలరా? అమెరికా పోవాల్సిందే ఆ డాలర్లతో ఇక్కడ పొలాలు,స్థలాలు కొనాల్సిందే.... ఇంకేముంది..పరుగో పరుగు... ఆ కోర్సు కాకుండా హ్యూమానిటీస్ , సైన్స్ చదవాలంటే ఒక్క పరువున్న కాలేజీలు, అసలు ఉనికి కోల్పోని కాలేజ్ ఒక్కటన్నా ఉందా?

ఈ రోజుకూ ఆ డిల్లీ St.Stephen's, Sriram, Lady Sriram, Hansraj నుంచి మన దక్షిణాన లో చెన్నై Loyola,s\Stella Marys,...బెంగుళూరు క్రిస్ట్, సెయింట్ జోసెఫ్, మౌంట్ కార్మెల్ కాలేజీల్లా మన వాటిలో ఒక్కటయినా అలా లెగసీ మెయింటెన్ చేస్తున్నాయా? అంతెందుకు..ఇండియా టుడే యాన్యువల్ సర్వే లో ప్రతి రంగంలో ఉన్న టాప్ 10 కాలేజీల లో ఒక్కటన్నా మన తెలుగు రాష్ట్రాలవి వున్నాయా?

ఈ కార్పొరేట్ పాఠశాలల వెనకాల ఇంతలా పరిగెత్తాలా?అన్న ప్రశ్నకు..నీకేం తెలుసు?బయట ఎంత కాంపిటీషన్ ఉందో అని జవాబు చెబుతారు...
ఆ డాక్టర్,ఇంజనీర్ కాకుంటే బతకలేరు..మన కాలంలా కాదు అనే జవాబు... నిజమే..మన కాలంలో కాంపిటిషన్ లేనప్పుడు నువ్వెందుకు డాక్టర్ కాలేదు?ఏ రోజు పోటీ ఆరోజుది..ఆ రోజులకు తగిన ఉపాధి అవకాశాలు అప్పటివి..ఈరోజువి ఇప్పుడు... సరే ఇదో అంతులేని చర్చ.
కానీ ఈ కార్పొరేట్ కాలేజీలు ఏజంట్లను ను పంపి రాష్ట్రం నలుమూలల్లోని స్కూల్స్ లో విద్యార్థుల వివరాలు సేకరించి ఎర వేస్తారు...పిల్లలు,పెద్దల మెదుళ్లు తొలుస్తారు... చేరిన లక్షలాది విద్యార్థుల్లో వచ్చిన వందల ర్యాంకులే ప్రచారం చేసుకుంటారు... ఇక అక్కడ చేసిన పిల్లలు ఆ వత్తిడి తట్టుకోలేక చేసుకుంటున్న అఘాయిత్యాలు చూస్తూనే ఉన్నాం...
ఇప్పుడిదంతా ఎందుకు అంటారా? మనమంతా తేరగా దొరికారని పాపం ఆ ప్రభుత్వ ఉపాధ్యాయులను తిట్టిపోస్తుంటాము..వాళ్ల పిల్లలు ఆ పాఠశాలల్లో చదవరని.... మరి వందలాది ఐఐటి ,మెడిసిన్ ర్యాంక్స్ తెప్పిస్తున్న ఈ కార్పొరేట్ కాలేజ్ యజమాని కొడుకు మాత్రం.... వత్తిడి లేని పాఠశాలల్లో చదువుతాడు
ఏదైతేనేం మనోళ్ల ఉన్మాదం ఆగేదెన్నడో!
