బీఎస్ 3 వాహనాల నిషేధం తర్వాత బైక్ కంపెనీలు భారీ డిస్కౌంట్ ఆఫర్ లు ప్రకటించడంతో వినియోగదారులు షోరూంల వద్ద క్యూ కడుతున్నారు. అయితే ఇదే అదనుగా డీలర్ల లు నో స్టాక్  బోర్డు పెట్టి బ్లాక్ మార్కెట్ కు వాహనాలను తరలిస్తున్నారు. 

సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో బీఎస్ 3 ద్విచక్ర వాహనాలు ఏప్రిల్ 1 నుంచి భారత్ లో అమ్మడం నిషిద్ధం. దీంతో బైక్ కంపెనీలన్నీ తమ దగ్గర ఉన్న వాహనాలన్నీ ఏదో ఒక ధరకు భారత్ మార్కెట్ లోనే అమ్మడానికి సిద్ధమయ్యాయి.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఏప్రిల్ 1 లోపే అమ్మకాలన్నీ చేయడాలనే సంకల్పంతో అన్ని బైక్ కంపెనీలు ధరలపై భారీ డిస్కౌంట్ లు ప్రకటించాయి.

గరిష్టంగా రూ. 22 వేల నుంచి కనిష్టంగా రూ. 8 వేల వరకు వివిధ బైక్ కంపెనీలు తమ వాహనాల ధరలు తగ్గించాయి.

ఈ రోజులోపే ఈ డిస్కౌంట్ ఆఫర్ ఉంటుంది. ఈ విషయం తెలియడంతో వినియోగదారులు వివిధ బైక్ షోరూంల వద్దకు పరుగులు తీస్తున్నారు. కానీ, ఇదే అదునుగా షోరూం యజమానులు, బైక్ డీలర్లు కొత్త మోసానికి తెరతీశారు.

షోరూం వద్ద బీఎస్ 3 వాహనాలను అమ్ముడైపోయాయని బోర్డు పెట్టి ఆ వాహనాలను బ్లాక్ మార్కెట్ కు తరలిస్తున్నారు.

మార్చి 31 తేదీతో ఇన్ వాయిస్ లు తయారు చేసురూని, తమ వద్ద ఉన్న వాహనాల వివరాలను రాసేసి, వాటిని అమ్ముకున్నట్టు రికార్డులలో చూపిస్తున్నారు.

ఆ తర్వాత వీటిని అసలు ధరలకు కస్టమర్లకు అంటగట్టేందుకు సిద్ధమవుతున్నారు.

మార్చి 31 బైక్ కొన్నట్లు ఇన్ వాయిస్ ఉన్న అలాంటి బైక్ లు రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు అనుమతి ఉంది. అందుకే డీలర్లు ఈ డిస్కౌంట్ ఆఫర్ లను వినియోగదారులకు చేరకుండా ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నారు.