Asianet News TeluguAsianet News Telugu

ఆంధ్రా బిజెపిలో పెను మార్పులు, పది కారణాలు

  • బిజెపి ఆంధ్రా పాలసీలో పెనుమార్పు రానుందని చెబుతున్నారు
  • రెడ్లకు, కాపులకు గేట్లు తెరచుకుంటాయని అంటున్నారు
  • ఒక కులం , ఒక ముఠా కాకుండా అన్ని కులాల అండ కోసం బిజెపి కృషి చేస్తుందట
ten reason that warrant change in  BJP Andhra Policy

ప్రత్యక్ష రాజకీయాలనుంచి వెంకయ్యనాయుడు నిష్క్ర మించడంతో రాష్ట్ర రాజకీయాలలో పెనుమార్పు రానుందని చాలా మంది బిజెపినాయకులు భావిస్తున్నారు. వెంకయ్యనాయుడు గత మూడేళ్లలో రాష్ట్రంలోనే ఎక్కువ కనిపించారు. బిజెపికి ఇపుడున్న రంగు రుచి వాసన ఆయన వల్లె వచ్చింది. ఇది మారాలని పార్టీలో చాలా  కాలంగా నాయకత్వం మీద వత్తిడి ఉంది. వెంకయ్యనాయుడు రాష్ట్ర రాజకీయాలలో  క్రియాశీలంగా ఉన్నంత వరకు అది సాధ్యంకాదని కూడా వారు భావిస్తూ వచ్చారు. ఇపుడు నాయుడు దేశంలో అత్యంత ప్రతిష్టాకరమయిన ఒక పదవిలోకి వెళ్తున్నందున కొత్త అజండా అమలవుతుందని వారు ఇపుడు భావిస్తున్నారు. అందుకే,బయటి వాళ్లకు వెంకయ్యనాయుడి నిష్క్రమణ కొత్తగా కనిపించవచ్చు. బిజెపి అంతర్గత పోరాటాన్ని గమనిస్తున్నవారెవరికి ఇది కొత్త కాదు, వింత కాదు. రాయలసీమ బిజెపినాయకులు, పశ్చిమగోదావరి జిల్లానాయకులు  ఈమార్పును ఏడాది కిందే వూహించారు. 2019 లోపు మార్పు రావచ్చు అని అనుకున్నారు.  అంతే తేడా. అందుకే బిజెపి లోలోన ఇది పెద్ద సంచలనం కాలేదు.

 

ఇవన్నీ కూడా తెలుగుదేశం పార్టీకి ఆందోళన కలిగించే విషయాలే. బిజెపిలో ఆంధ్ర పాలసీలో పెను మార్పులొస్తాయనేందుకు బిజెపి నేతలు కొందరు చూపిస్తున్న పది కారణాలివే:

 

  1. గత మూడేళ్లలో రాష్ట్రంలో బిజెపి విస్తృతం కాలేదు. ఒకే కులం గ్రూపుగా, టిడిపి అనుబంధ సంస్థగా నే ఉండిపోయింది. కొత్త కులాలు ప్రవేశించకుండా అడ్డుగోడలున్నాయి. గ్రూపిజం బాగా పెరిగిపోయింది
  2. కాపులు, రెడ్లు బిజెపిలోకి రాకుండా అడ్డుకున్నారు. కొంత మంది కాపు నాయకులు చివరకు వెంకయ్యనాయుడుప్రమేయం లేకుండా నేరుగా బిజెపి ప్రధాన కార్యదర్శి రామ్ మాధవ్ సహకారంతో బిజెపిలో చేరారు.దీనికి ఉదాహరణ కన్నా లక్ష్మినారాయణ. కిరణ్ కుమార్ రెడ్డి వంటి పలువురు నేతలు రావటానికి అటంకాలున్నాయి.
  3. ఇపుడున్ననాయకత్వం కారణంగా కొత్త జనరేషన్ పార్టీలో ఎదగలేకపోతున్నది
  4. ఇపుడున్న నాయకత్వం దోరణి వల్ల రాయలసీమ ప్రాంత నాయకుల్లో బాగా అసంతృప్తి చెలరేగింది.
  5. ఇప్పటి నాయకత్వ ప్రయోజనాలు రాయలసీమ ప్రాంతానికి అనుకూలంగా లేవు
  6. టిడిపి తో దూరం జరగ్గ పోతే, వచ్చ ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు ఇచ్చే  20 లేదా 30సీట్లే స్వీకరించాల్సి ఉంటుంది.
  7. ఇపుడున్న నాయకత్వంలో బిజెపిలోకి వచ్చే ఇతర పార్టీల నాయకులకు 2019లో నియోజకవర్గాలు చూపలేరు.
  8. టిడిపికంటే జగన్ తో వెళితే 2019లో ఎక్కువ స్థానాలు పొందవచ్చు. బెజెపి నాయకులు కనీసం 75 స్థానాలు ఆశిస్తున్నారు.
  9. ఒక కులాన్నే అంటిపెట్టుకోకుండా ఎక్కువ కులాల అండ బిజెపి సంపాదించాలి.
  10. టిడిపితో పొత్త  వద్దు అంటున్నవారి మాట పార్టీ ఆలకించింది.టిడిపి కంటే జగన్ తో పోవడం మంచిదన్నవాదన బిజెపిలో బలపడుతూ ఉండటం

 

 

 

 

Follow Us:
Download App:
  • android
  • ios