ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద గిరిజనుల జాతర.. మేడారం జాతర తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే పరిమితమైన ఈ జాతరకి ఇప్పుడు అరుదైన ఘనత దక్కింది

ఆసియా ఖండంలోనే రెండో అతి పెద్ద గిరిజనుల జాతర.. మేడారం జాతర. తెలంగాణ ప్రజలు ప్రతి సంవత్సరం నాలుగు రోజులపాటు ఈ జాతరను అత్యంత వైభంగా జరుపుకుంటారు. తెలంగాణ రాష్ట్రం వరకు మాత్రమే పరిమితమైన ఈ జాతరకి ఇప్పుడు అరుదైన ఘనత దక్కింది. వచ్చే సంవత్సరం గణతంత్ర దినోత్సవం రోజున దేశ రాజధాని దిల్లీలో తెలంగాణ రాష్ట్రం తరపున మేడారం సమ్మక్క, సారలమ్మ సకటాన్ని వూరేగించనున్నారు.

వివరాల్లోకి వెళితే.. గణతంత్ర దినోత్సం, స్వాతంత్య్ర దినోత్సవం రోజున.. దేశ రాజధాని దిల్లిలో జాతీయ జెండా వందనం నిర్వహిస్తారు. ఆ సమయంలో దేశంలోని అన్ని రాష్ట్రాలకు సంబంధించిన సకాటలను అక్కడ ఊరేగిస్తారు. ఆ రాష్ట్ర ప్రత్యేకతను తెలియజేసేలా సకటాలను ఏర్పాటు చేస్తారు. కాగా.. ప్రతి సంవత్సరం ఏర్పాటు చేస్తున్న మాదిరిగా కాకుండా.. సకటాలను కొంచెం ప్రత్యేకంగా తయారు చేయాలని సంబంధిత కమిటీ రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది.

2015వ సంవంత్సరంలో బోనాల థీమ్ తో గణతంత్ర వేడుకల్లో పాల్గొన్న తెలంగాణ సకటం... 2016,2017లో అవకాశం దక్కించుకోలేదు. గత రెండు సంవత్సరాలుగా తెలంగాణ ప్రభుత్వం బతకమ్మ థీమ్ ని తయారు చేయగా.. అది కమిటీ సభ్యలను ఆకట్టుకోవడంలో విఫలమైంది. దీంతో ఈ సంవత్సరం ఎలాగైనా గణతంత్ర వేడుకల్లో పాల్గొనాలనే నిర్ణయంతో వివిధ రాకల థీమ్ లను తయారు చేశారు.

దీంతో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఈ సారి మిషన్ భగీరథ, కాకతీయుల సామ్రాజ్యం, మేడారం సమ్మక్క సారలమ్మ జాతరల థీమ్ లను తయారు చేసింది. వీటి విషయమై తెలంగాణ అధికారులు కమిటీతో పలుమార్లు సమావేశమైనట్లు సమాచారం. కాగా.. ఈ థీమ్ లలో గిరిజనుల సంప్రదాయ జాతరైన మేడారం సమ్మక్క, సారలమ్మ జాతర థీమ్ అధికారులకు బాగా నచ్చిందట. ఈ జాతరను తెలంగాణ మహా కుంభమేళా అని కూడా పిలుస్తారు. దీంతో 2018 గణతంత్ర వేడుకల్లో మేడారం జాతర విశిష్టతను దేశ వ్యాప్తంగా చాటిచెప్పే అవకాశం దక్కింది.