అంధ్ర అసెంబ్లీలో నియంతృత్వం రాజ్యమేలుతుందోంటున్న తలసాని

ఆంధ్ర ప్రదేశ్ ప్రతిపక్ష సభ్యలు అసెంబ్లీ కష్టాల మీద తెలంగాణా సినిమాటోెగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాాస్ యాదవ్ సానుభూతి చూపించారు.

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎలా నడుస్తుందో ఆయన బాగా పరిశీలిస్తున్నట్లున్నారు. అంతేకాదు, అక్కడ అసెంబ్లీ అధికార తెలుగుదేశం పార్టీ బాగా జులుం ఛలాయిస్తున్నదని కూడా కనుక్కున్నారు. ఈ విషయాన్ని తలసాని చక్కగా వివరించారు. దీనితో పోలిస్తె తెలంగాణా అసెంబ్లీ చాలా బాగా నడస్తున్నదని, ప్రతిపక్ష సభ్యులకు పూర్తి స్వేచ్ఛ ఉందని, సభ్యుల మీద కేసులు పెట్టడం కూడా లేదని ఆయన చెప్పారు.

తమాషా ఏమంటే, తలసాని టిఆర్ఎస్ లో చేరింది తెలుగుదేశం ఎమ్మెల్యేగానే., టెక్నికల్ గా ఆయనింకా తెలుగుదేశం సభ్యుడే. 2014లో హైదరాబాద్ సనత్ నగర్ నుంచి చంద్రబాబు ప్రోత్సాహంతో పోటీ చేసి గెల్చాక పార్టీఫిరాయించి టిఆర్ఎస్ లో చేరి మంత్రి అయ్యారు. ఇపుడాయనకు చంద్రబాబు నాయుడు నియంత లాగా కనిపిస్తున్నారు.

‘ ఆంధ్రలో ప్రతిపక్షాన్ని కనీసం మాట్లాడనీయడం లేదు. అక్కడ నియంతృత్వం రాజ్యమేలుతోంది. అదే తెలంగాణ అసెంబ్లీలో మాత్రం ప్రతి పక్ష సభ్యులు మాట్లాడడానికి ఎక్కువ అవకాశం ఇస్తున్నం,’ మంత్రి తలసాని శ్రీనివాస్‌ అన్నారు.

మంగళవారం అసెంబ్లీ లాబీల్లో ఆయన మీడియాతో మాట్లాడారు.

 ‘‘ఏపీ సీఎం చంద్రబాబు మాదిరిగా ఇక్కడ సభ్యుల మీద అక్రమ కేసులు పెట్టడం లేదు. ఆంధ్ర అసెంబ్లీలో ప్రతిపక్ష పార్టీకి ఎక్కడ స్వేచ్ఛ ఉంది. చంద్రబాబు గొంతు నొక్కుత లేడా. అదే తెలంగాణలో ప్రతిపక్షాలకు ఎంత స్వేచ్ఛ ఇస్తున్నామో మీరే చూప్తున్నారు,’అని ఆయన అన్నారు.



ఏపీ అసెంబ్లీని ఎప్పుడైనా చక్కగా నడిపిన దాఖలా వైఎస్సార్‌ కాంగ్రెస్‌ ఎమ్మెల్యే రోజా విషయంలో చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు అందరికీ తెలిసినవే. బాబు మాదిరిగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలపై మేం అక్రమ కేసులు పెట్టడం లేదు. చంద్రబాబులాగా బెదిరింపులకు పాల్పడలేదు, ’’అని తలసాని అన్నారు.

ఇంత లోతుగా సబ్జెక్టుతో మాట్లాడే కేసీఆర్‌ వంటి నాయకుడిని తానింత వరకూ చూడలేదని కూడా తలసాని భజన చేశారు. ‘ తెలంగాణా అసెంబ్లీలో ప్రతిపక్షాలకు పూర్తి స్వేచ్ఛ ఉంది . వ్యక్తిగత దూషణలు కెసిఆర్ కు నచ్చనే నచ్చవు. వాటికి ఆయన దూరమని చెప్పారు.’