ఈనెల 27న విజయవాడకు రానున్న కేసీఆర్  కనకదుర్గమ్మకు ముక్కుపుడక సమర్పించనున్న కేసీఆర్  తెలంగాణ మొక్కులు తీర్చుకుంటున్న కేసీఆర్

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ కనకదుర్గమ్మ వారి మొక్కు తీర్చుకోనున్నారు. నవ రాత్రి ఉత్సవాల సందర్భంగా ఈ నెల 27వ తేదీన ఆయన విజయవాడకు వెళ్లనున్నారు. కుటుంబ సమేతంగా అమ్మవారిని దర్శించుకొని ... కనక దుర్గకు బంగారు ముక్కు పుడకను సమర్పించనున్నారు.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

గతంలో కేసీఆర్.. వరంగల్ లోని భద్రకాళీ అమ్మవారికి బంగారు కిరీటం, తిరుపతి తిరుచానూర్ లోని పద్మావతి అమ్మవారికి ముక్కు పుడక, కురవిలోని వీరభద్రస్వామికి బంగారు మీసాలు సమర్పించారు. తెలంగాణ రాష్ట్రం వస్తే మొక్కులు తీర్చుకుంటానని ప్రకటించిన ఆయన అందు కోసం రూ.59లక్షలు కేటాయించారు.

ఇందులో భాగంగానే ఈ నెల 27న విజయవాడ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకోనున్నారు. తన ఢిల్లీ పర్యటన ముగిసిన వెంటనే.. విజయవాడ వెళతానని ప్రకటించారు. ఈ సందర్భంగా అమ్మవారికి పట్టు వస్త్రాలు కూడా సమర్పించనున్నట్లు తెలిపారు. అనంతరం ఏపీ సీఎం చంద్రబాబుతో సమావేశమయ్యే అవకాశం కూడా ఉంది.

<!-- You're using demo endpoint of Iframely API commercially. Max-width is limited to 320px. Please get your own API key at https://iframely.com. -->ఏషియానెట్-తెలుగు ఎక్స్ ప్రెస్ న్యూస్