కోహ్లీ ఆదాయం ఎంతో తెలుసా?

team india captain virat kohli top postion in forbs list of this year
Highlights

  • ఫోర్బ్స్ జాబితాలో చోటు దక్కించుకున్న కోహ్లీ
  • మొదటి రెండు స్థానాల్లో సల్మాన్, షారూక్
  • మూడో స్థానంలో విరాట్ కోహ్లీ

కొత్త పెళ్లి కొడుకు కోహ్లీ.. మరో ఘనత సాధించాడు. అమెరికన్ బిజినెస్ మ్యాగజైన్ ఫోర్బ్స్ ఈ ఏడాది విడుదల చేసిన సెలబ్రెటీ సంపన్నుల జాబితాలో కోహ్లీ మూడో స్థానం దక్కించుకున్నాడు. సీనియర్ క్రికెటర్లు సచిన్ టెండుల్కర్, మహేంద్రసింగ్ ధోనీల కన్నా ముందు స్థానంలో నిలిచాడు.

ఇక మొదటి స్థానంలో బాలీవుడ్ కండల వీరుడు సల్మాన్ ఖాన్ నిలిచాడు.2017లో సల్మాన్‌ సినిమాలు, బ్రాండ్‌లతో కలిపి సల్మాన్‌ ఆదాయం రూ.232.83 కోట్లు. ఇప్పటివరకూ సల్మాన్‌ సంపాదన మొత్తం రూ.2,683 కోట్ల ఆదాయంతో 8.67 శాతం ఉంది. షారుక్‌ ఖాన్‌ సంపాదన రూ.170.50 కోట్లు. ఇక మూడో స్థానంలో ఉన్న విరాట్‌ రూ.100.72 కోట్లు సంపాదించారు

2016లోనూ టాప్‌ మూడు స్థానాల్లో సల్మాన్‌, షారుక్‌, విరాటే ఉండడం గమనార్హం. ఈ ఏడాది ‘జాలీ ఎల్‌ఎల్‌బీ2’, ‘టాయ్‌లెట్‌: ఏక్‌ ప్రేమ్‌కథా’ చిత్రాలతో హిట్లు సాధించిన అక్షయ్‌కుమార్‌ రూ.98.25 కోట్ల ఆదాయంతో నాలుగో స్థానంలో ఉన్నారు. ఇక టాప్‌ టెన్‌లో కేవలం ఒకే ఒక్క కథానాయిక స్థానం దక్కించుకున్నారు. ఆమే గ్లోబల్‌స్టార్‌ ప్రియాంక చోప్రా. రూ.68 కోట్ల ఆదాయంతో ఏడో స్థానంలో ఉన్నారు.

ఐదో స్థానంలో సచిన్ టెండుల్కర్, ఎనిమిదో స్థానంలో మహేంద్ర సింగ్ ధోని చోటు దక్కించుకున్నారు.బాలీవుడ్‌ ‘గ్రీక్‌ గాడ్‌’ హృతిక్‌ రోషన్‌ తొమ్మిదో స్థానంతో సరిపెట్టుకున్నారు. ఇక రణ్‌వీర్‌ సింగ్‌ పదో స్థానంలో ఉన్నారు.

 

 

loader