ఇడుపులపాయలో సైనికులు దాడిచేస్తే డేరా బాబా సంపద కంటే ఎక్కువే దొరుకుతుంది

తెలుగు దేశం ఎమ్మె ల్సీ బుద్దా వెంకన్న ఈ రోజు వైసిపి నేత ల మీద, పార్టీ అధికారప్రతినిధి భూమన కరుణాకర్ రెడ్డి మీద తీవ్రమయిన విమర్శలు చేశారు.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ఈ రోజు విజయవాడలో విలేకరులతో మాట్లాడుతూ భూమన్ కరుణాకర్ రెడ్డి, వైసిపి నాయకులు డేరాబాబా ఆశ్రమంలో శిక్షణా పొందినట్లుందని అన్నారు.

ప్రజల సొమ్మును ఎలాగా దొచేయాలి అనే విషయంలో బాగా శిక్షణా తీసుకున్నారని ఆయన ఆరోపించారు.

‘‘ హర్యానాలో లాగా ఒక్కసారి భారత బలగాలు ఇడుపుల పాయలో దాడి చేస్తే...డేరా బాబా ఇంట్లో బయట పడ్డ ఆస్తిపంజారాలు కన్న ఎక్కువగా బయటపడతాయి. డేరా బాబా గదులో వెలుగుచూస్తున్న దానికన్న ఇడుపులపాయలో ఎక్కువ నిధులు బయట పడుతాయి.అనంత పద్మనాభ స్వామి దేవాలయం లో కన్నా ఎక్కువ ఖజనా బయట పడుతుంది,’’ అని అన్నారు. ఇలాంటి వ్యక్తులకు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని విమర్శించే హక్కులేదని అంటూ దేశ ప్రధాని పదవిని తృణ ప్రాయంగా వదులుకున్న ఏకైక నాయకుడు చంద్రబాబు అని కీర్తించారు.

2019 లో ఎపిలో ఉన్న మొత్తం 175సీట్లను గెలిపించి చంద్రబాబుకు ప్రజలు కానుకగా ఇవ్వనున్నారని కూడా వెంకన్న అన్నారు.