జగన్ కుటుంబ సభ్యులు కూడా క్యూలో ఉన్నారా?

First Published 21, Dec 2017, 2:05 PM IST
TDP MLC Buddha venkanna claims Jagan family members would also join TDP
Highlights

టిడిపి ఎమ్మెల్సీ బుద్ధా వెంకన్న అవునంటున్నారు

కనీసం మరొక పది మంది ఎమ్మెల్యే కొత్త సంవత్సరంలో జగన్ కు గుడ్ బై చెబుతారని అంతా అనుకుంటున్నపుడు టిడిపి ఎమ్మెల్సీ, ఆంధ్రప్రభుత్వ చీఫ్ విప్  బుద్ధావెంకన్న మరొక సెన్సేషనల్  ప్రకటన చేశారు. ఎమ్మెల్యేలే కాదు, జగన్ కుటుంబ సభ్యులు కూడా తెలుగు దేశం పార్టీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని ఆయన ఈ రోజు విజయవాడలో ప్రకటించారు. అయితే, ఈ విషయం మీద అంతకంటే వివరాలు వెల్లడించలేదు.

జగన్ పాదయాత్ర ‘ప్రజాసంకల్పయాత్ర’ గురించి మాట్లాడుతూ పాదయాత్రకు ప్రజా‌ స్పందన కరువైంది..అందుకే ఈలలకోసం చప్పట్ల కోసం ఆయన  చంద్రబాబు పై అవాకులు చవాకులు పేలుతున్నారని విమర్శించారు.చంద్రబాబు దొర కాదు మకుటం లేని మహారాజు అని వర్ణిస్తూ,

రామక్రుష్ణారెడ్డి 200 కోట్ల కుంభకోణం చేస్తే జగన్ ఎందుకు స్పందించడం లేదు అని అడిగారు.  ఇందులో జగన్ వాటా ఎంతో చెప్పాలని డిమాండ్ చేశారు.

నిజం చెబితే వెయ్యి ముక్కలవుతుందని జగన్ కు శాపం ఉంది..అందుకే జగన్ ఎపుడే  నిజం మాట్లాడడని, అబద్దాలు చెబుతూ బతకాలని వెంకన్న అన్నారు.

చెప్పడం లేదు. వైసిపి కి 2014 నుంచే  కౌంట్ డౌన్  మొదలయ్యింది,2019 తో అది పూర్తవుతుందని బుద్ధా వెంకన్నా అన్నారు. బిజెపి ఎమ్మెల్సీ సోము వీర్రాజు చేస్తున్నఆరోపణలన్నీ ముఖ్యమంత్రి పరిశీలనలో ఉన్నాయని కూడా ఆయన వెల్లడించారు.

 

loader