ఈ ఫిరాయింపు ఎమ్మెల్యే ఏంచేశాడో తెలుసా?

First Published 23, Nov 2017, 3:00 PM IST
TDP MLA Harasses Liquor Dealer Goes Missing
Highlights
  • ప్రకాశం జిల్లాలో తారా స్థాయికి చేరిన ఆదిపత్య పోరు
  • ఒకరి మద్దతు దారులను మరొకరు వేధించడం మొదలుపెట్టారు.
  • గొట్టిపాటి వేధింపులు తట్టుకోలేక అదృశ్యమైన లిక్కర్ డీలర్ శ్రీనివాస్

అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్.. పరిచయం అక్కర్లేని పేరు. వైసీపీ గుర్తుపై గెలిచి.. ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించన సంగతి అందరికీ తెలిసిందే. ప్రతి పక్ష పార్టీ నుంచి అధికార పార్టీలోకి జంప్ చేయగానే.. గొట్టిపాటికి అహంకారం బాగా చుట్టుముట్టినట్లుంది. అందుకే అందరినీ వేధించడం మొలుపెట్టాడు. ఆదిపత్య పోరుతో అమాయకులను బలిచేస్తున్నాడు.

అసలేం జరిగిందంటే.. టీడీపీ సీనియర్ లీడర్ కరణం బలరామ్ కి, ఫిరాయింపు ఎమ్మెల్యే గొట్టిపాటికి మధ్య వివాదం కొన్ని సంవత్సరాల నాటిది. మొన్నటిదాకా ప్రత్యర్థులుగా ఉన్న వీరు.. ఇప్పుడు ఒకే పార్టీలో కొనసాగుతున్నారు. దీంతో వీరిద్ధరి మధ్య ఇప్పుడు ఆదిపత్య పోరు నడుస్తోంది. ఇటీవలే ఆ ఆదిపత్య పోరు బహిర్గతమైంది. ఈ పోరు  ఒకరి మద్దతుదారులను మరొకరు  చంపుకునేదాకా  చేరినట్లు ఆరోపణలు ఉన్నాయి.

ప్రస్తుత విషయానికి వస్తే కరణం బలరామ్ మద్దతు దారుడైన శ్రీనివాస్ అనే వ్యక్తి తాజాగా లిక్కర్ ఔట్ లెట్ లైసెన్స్ పొందాడు. కరణం మీద ఉన్న కోపంతో..గొట్టిపాటి.. శ్రీనివాస్ ని వేధించడం మొదలుపెట్టినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే తోపాటు అతని పీఏ సారథి కూడా శ్రీనివాస్ ని వేధించేవాడట. దీంతో  ఒక సూసైడ్ నోట్ రాసి ఇంటి నుంచి మాయమయ్యాడు. వారం రోజులైనా అతని జాడ కనిపించలేదు. శ్రీనివాస్ సోదరుడు ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా.. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం గమనార్హం.

loader