అనంతపురం ఏరువాక పర్యటన కొచ్చిన  ముఖ్యమంత్రి ఈ ఉదయం పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. ఆయనకు స్వాగతం చెప్పటానికి ప్రథమ పౌరుడిగా మునిషిపల్  ఛెయిర్మన్ గంగన్న కూడా వచ్చారు. అయితే, పోలీసులు ఆయనను అనుమతించలేదు.ఇది అవమానం అంటూ ఆయన డిఎస్ పిని కులంపేరుతో తిట్టారు. ఈ కులం అధికారులొచ్చాక తనకు అవమాానాలు ఎదురవుతున్నాయని నిరసనగా రోడ్డు మీద బైఠాయించారు.గొడవ వీడియోలో చూడండి.

గూగుల్‌లో ఆసక్తికరమైన సమాచారం కోసం ఏసియానెట్ తెలుగు ను మీ ఫ్రిఫర్డ్ సోర్స్ గా ఎంచుకోండిgooglePreferred

పుట్టపర్తి డిఎస్పి ని టీడీపీ మునిసిపల్ చైర్మన్ గంగన్న కులం పేరుతో దూషించారు. పోలీసులు తనను అవమానపరుస్తున్నారని, ఈ ‘కులం’ అధికారులొచ్చాక తనలాంటి వారికి అవమానం జరుగుతు ఉందని ఆయన అంటున్నారు. విషయం ఏమిటంటే, అనంతపురం ఏరువాక పర్యటనకొచ్చిన ముఖ్యమంత్రి ఈ ఉదయం పుట్టపర్తి విమానాశ్రయంలో దిగారు. ఆయన స్వాగతం చెప్పటానికి ప్రథమ పౌరుడిగా గంగన్న కూడా వచ్చారు. అయితే, పోలీసులు ఆయనను అనుమతించలేదు. దీనితో గొడవ మొదలయింది.ఇది తనకు అవమానమని, దీనికి కారణం ఒక కులం అధికారులే నని గంగన్న వాపోయారు. ఈ అవమానానికి నిరసనగా గంగన్న రోడ్డు మీద బైఠాయించారు. డిఎస్ పిని తిట్టినా పోలీసులు చాలా సంయమనం పాటిస్తున్నారు. కారణం దూషించిన వ్యక్తి అధికార పార్టీ నాయకుడు.