బీకాంలో ఫిజిక్స్ చదివిన జలీల్ ఖాన్ కు ఈయన బ్రదర్ లా ఉన్నారు. డిగ్రీలో సీఈసీ చదివానని తన ‘ఉన్నత’ చదవుల గురించి ఇలా చెప్పుకొస్తున్నారు.  

టీడీపీ నేత జలీల్ ఖాన్ బీకాంలో ఫిజిక్స్ చేసి దేశవ్యాప్తంగా పేరు తెచ్చుకున్నారు. జాతీయ మీడియా కూడా ఆయన విద్యార్హతలపై ప్రశంసలు కురింపించింది. దీంతో ఆయన ఒక్కసారిగా సెలబ్రెటీ అయిపోయారు.

ఇంకా అలాంటి సెలబ్రెటీలు తెలుగునాట ఎవరూ లేరే అని అనుకుంటున్న సమయంలో ఈయన వచ్చారు.

తాను కూడా డిగ్రీలో సీఈసీ చేశానని చెప్పుకొచ్చారు. తన కాలంలో ఇంటర్ లో అలాంటి గ్రూప్ లు లేవట. అందుకే డిగ్రీలో సీఈసీ చేయాల్సి వచ్చిందట.

ఇంతకీ ఈయనెవరో చెప్పలేదు కదూ..

ఈయన కూడా టీడీపీ నేతే... పేరు ఎస్వీ మోహన్ రెడ్డి.. ఎమ్మెల్యే కూడా..