టీచర్ పై విద్యార్థుల అత్యాచారం, ఆపైన...

students given life term for killing teacher  and  sexual assault
Highlights

  • కర్ణాటక రాజధాని బెంగళూరులో దారుణం
  • టీచర్ పైనే అత్యాచారం చేసి హతమార్చిన నలుగురు విద్యార్థులు

విద్యాబుద్దులు నేర్పిన ఓ టీచర్ పైనే కామాందులైన విద్యార్థుల కన్ను పడింది. ఎలాగైనా టీచర్ ను అనుభవించాలన్న కోరికతో రగిలిపోయిన విద్యార్థులు ఆమెపై సామూహిక అత్యాచారం చేశారు. ఈ విషయం ఎక్కడ బైటపెడుతుందోనన్న అనుమానంతో ఆమెను హతమార్చి తమ పైశాచికత్వాన్ని బైటపెట్టారు. ఈ ఘటనపై విచారణ చేపట్టిన పోలీసులు నిందితులను అరెస్ట్ చేసారు. ఈ కేసు గతకొన్నేళ్లుగా కోర్టులో విచారణలో నలుగుతోంది. అయితే ఈ కామాందులకు జీవిత ఖైదు శిక్ష విధిస్తూ  బుధవారం రామనగర జిల్లా న్యాయస్థానం తీర్పునిచ్చింది.

ఈ ఘటనకు సంభందించిన వివరాలిలా ఉన్నాయి. బెంగళూరు నగర శివారులోని బసవనపుర హైస్కూల్‌లో ఓ ఉపాధ్యాయురాలుగా ఓ యువతి(29) పని చేసేది. అయితే అదే పాఠశాల పూర్వ విద్యార్థులు నర్సిములు, రవి, మంజునాథ్, రవి లు ఆమెపై కన్నేశారు. తమకు చదువు చెప్పిన ఉపాద్యాయురాలన్న విషయాన్ని మరిచిపోయి ఎలాగైనా ఆమెను అనుభవించాలని పథకం పన్నారు. అందులో భాగంగా 2009, ఆగస్టు 2న స్కూల్ నుంచి ఇంటి  బయలుదేరిన ఆమెను ఇంటివద్ద దిగబెడతామంటూ నమ్మించి కారులో ఎక్కించుకున్నారు. తమ వద్ద చదువుకున్న విద్యార్థులే కావడంతో ఏం ఆలోచించకుండా ఆమె వారితో కలిసి వెళ్లింది. కానీ వారి దురుద్దేశాన్ని గమనించలేక పోయింది.

నిందితులు కారును నిర్జన ప్రదేశానికి పోనిచ్చి, గొంతుపై కత్తిపెట్టి బెదిరించి అత్యాచారానికి పాల్పడ్డారు. ఒకరి తర్వాత ఒకరు అత్యంత పాశవికంగా తమ కోరిక తీర్చుకున్నారు. ఆమె బయటకు వెళితే తమ విషయం బయటపడుతుందని బావించి గొంతు నులుమి చంపేశాడు. ఈ ఘటనపై ఎనిమిదేళ్ల‌పాటు కోర్టులో విచారణ కొనసాగింది. తాజాగా ఈ నేరం రుజువు కావడంతో నిందితులకి జీవిత ఖైదు శిక్ష విధిస్తూ న్యాయస్థానం తీర్పునిచ్చింది.

loader