రికార్డు రేటుకు ఐపీఎల్ రైట్స్‌

Star Wins India Broadcast India Digital Rest of World Rights for Rs 16347 crore
Highlights

  • ఐపీఎల్ ప్రసార హాక్కులక భారీ గిరాకీ.
  • 16,647.5 కోట్ల కు స్టార్ ఇండియా కొనుగోలు.
  • తీవ్రంగా ఉన్న పోటీ.

రికార్డు స్థాయిలో ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్ (ఐపీఎల్) ప్ర‌సార హాక్కులు అమ్ముడుపోయాయి. సోమ‌వారం ముంబాయిలో 2018-2023 వ‌ర‌కు ఐపీఎల్ ప్ర‌సార హాక్కుల వేలం జ‌రిగింది. ఐదేళ్లు ఐపీఎల్ ప్ర‌సార హాక్కుల‌ను స్టార్ ఇండియా సొంతం చేసుకుంది. అందులో స్టార్ ఇండియా లైవ్ మ్యాచ్‌ల‌ ప్ర‌సార హాక్కుల‌ను రూ. 16,347 కోట్ల‌కు ద‌క్కించుకుంది. 2008 లో 10 సంవ‌త్స‌రాల‌కు ఐపీఎల్ ప్ర‌సార హాక్కుల వేలంలో సోనీ రూ. 8,200 కోట్ల‌కు కొనుగోలు చేస్తే, ఇప్పుడు కేవ‌లం 5 సంవ‌త్స‌రాల‌కే రూ. 16,347.5 కోట్ల‌కు స్టార్ ఇండియా ఖ‌ర్చు చేయ‌డం గ‌మ‌నార్హం.

ఐపీఎల్‌ ప్ర‌సార హ‌క్కుల కోసం 14 మీడియా సంస్థ‌లు పోటీప‌డ‌గా, వారిలో ఎక్కువ‌గా రూ. 16,347.50 కోట్లు బిడ్ వేసి స్టార్ ఇండియా ప్ర‌సార హ‌క్కులను సొంతం చేసుకుంది. దీంతో 2018 నుంచి 2022 వ‌ర‌కు ఐదేళ్ల‌ పాటు ఐపీఎల్‌కు సంబంధించిన మీడియా, డిజిట‌ల్ కార్య‌క్ర‌మాల‌ను స్టార్ ఇండియా ప్ర‌సారం చేసుకునే సౌక‌ర్యం క‌లిగింది. భార‌త్‌లో డిజిట‌ల్‌, ఇంట‌ర్నెట్ మాధ్య‌మాల ద్వారా ప్ర‌సారం కోసం ఎక్కువ బిడ్ వేసిన సంస్థ‌లుగా రిల‌య‌న్స్ జియో, టైమ్స్ ఇంట‌ర్నెట్‌, ఎయిర్‌టెల్‌, ఫేస్‌బుక్ నిలిచాయి. టీవీ ప్ర‌సార హ‌క్కుల కోసం సోనీ, స్టార్ ఇండియాలు అధికంగా బిడ్ చేశాయి. బిడ్లు వేసిన 14 కంపెనీల్లో బామ్‌టెక్, బెయిన్ స్పోర్ట్స్ సంస్థ‌లను కొన్ని సంస్థాగ‌త కార‌ణాల(స్థానిక స‌మ‌స్య‌ల‌) వ‌ల్ల ఐపీఎల్ ప్ర‌సారానికి అన‌ర్హులుగా ప్ర‌క‌టించారు.
 

 

మరిన్ని తాజా వార్తాల కోసం కింద క్లిక్ చేయండి   

 

loader