అమరావతి నాలెడ్జ్ హబ్  ఒక ప్రయివేటు యూనివర్శిటితో ఈ రోజు మొదలయింది ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రారంభించారు  మొదటి బ్యాచ్ తరగతులు ఆగస్టులో మొదలవుతాయి

రాజధాని అమరావతికి  మొదటి విశ్వవిద్యాలయంవచ్చేసింది. ఇక్కడ ఏర్పాటుచేస్తున్న ప్రయివేటు ఎస్‌ఆర్‌ఎం యూనివర్సిటిని  కేంద్రమంత్రి ముప్పవరపు వెంకయ్యనాయుడు, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు శనివారం ప్రారంభించారు. గుంటూరు జిల్లా నీరుకొండ వద్ద ఏడు ఎకరాల్లో 3లక్షల చదరపు అడుగుల్లో యూనివర్సిటీ క్యాంపస్‌ నిర్మాణం జరుగుతుంది.  ఆగస్టు 7 నుంచి క్లాసులు ప్రారంభవుతాయి.  మొదటి బ్యాచ్ లో  200మంది విద్యార్థులుంటారు. అమరావతి నాలెడ్జ్ హబ్ గా మారేందుకు  ఎస్ ఆర్ ఎం విశ్వవిద్యాలయం తొలిమెట్టు అవుతుందని  ఈ సందర్భంగా మాట్లాడుతూ  ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పారు.