గత రెండు దశాబ్దాలుగా మన దేశంలోని టీనేజర్స్లో ఆత్మహత్యలు పెరిగాయి. కేవలం ఈ విద్యా సంవత్సరంలో 20మంది విద్యార్థులు మృతి చెందారంటే పరిస్థితి ఎలాఉందో  అర్థం చేసుకోవచ్చు.

బ్లూవేల్ ఛాలెంజ్... ప్రపంచాన్ని విణికిస్తోంది ఇప్పుడు.. తక్షణం దీన్ని అరికట్టాలని ప్రభుత్వాలు ప్రయత్నిస్తున్నాయి. ఎందుకంటే ఈ గేమ్ ఆడుతూ పిల్లలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని.. అందుకే చర్యలు తీసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. ఈ గేమ్ ఈ మధ్య కాలంలో అడుగుపెట్టింది. ఈ గేమ్ తో సంబంధం లేకుండా కూడా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పిల్లలు ఉన్నారు. ముఖ్యంగా విద్యార్థులు..

ఇదివరకు ఎప్పుడూ లేని విధంగా.. గత రెండు దశాబ్దాలుగా మన దేశంలోని టీనేజర్స్లో ఆత్మహత్యలు పెరిగాయి. ముఖ్యంగా విద్యార్థులు.. ఈ చదువులు మేము చదవలేమంటూ కొందరు. టీచర్ కొట్టాడనో, తిట్టాడనో కొందరు ఈ దారుణాలకు పాల్పడుతున్నారు. కేవలం ఈ విద్యా సంవత్సరంలో 20మంది విద్యార్థులు మృతి చెందారంటే పరిస్థితి ఎలాఉందో అర్థం చేసుకోవచ్చు.

కొన్ని పాఠశాలలు, ఇంజినీరింగ్ కళాశాలు, డిగ్రీ కాలేజీలు.. సైక్యాట్రిస్టులతో కౌన్సిలింగ్ లు కూడా ఇప్పిస్తున్నారు. అయినా పెద్దగా మార్పు కనిపించడం లేదన్నది వాస్తవం. 1995 నుంచి 2000 సంవత్సరంలోపు 1400మంది విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు. దీనిని అప్పటి ప్రభుత్వం తీవ్రంగా పరిగణించింది. దీంతో ప్రతి కళాశాలలో విద్యార్థులకు మానసిక నిపుణులతో కౌన్సిలింగ్ ఇప్పించాలని ఆదేశాలు కూడా జారీ చేశారు. కానీ ఆచరణలో పెడుతున్న విద్యా సంస్థల సంఖ్య చాలా తక్కువ.

ప్రతి విద్యా సంస్థలో మానసిక నిపుణులు విద్యార్థులకు కౌన్సిలింగ్ ఇవ్వాలనే నిబంధన ఉందని ప్రభుత్వ ఇంటర్ కాలేజీ అసోసియేషన్ ప్రెసిడెంట్ మధుసూదన్ రెడ్డి చెప్పారు. ముఖ్యంగా రెసిడెన్షియల్ కళాశాలలు కచ్చితంగా ఈ నిబంధనను పాటించాలని ఆయన చెబుతున్నారు. ఒక వేళ విద్యా సంస్థలు ఈ నియమాలను పాటించకపోతే వాటిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అభిప్రాయపడ్డారు.

మానసిక ఒత్తిడి, చదువుల్లో కాంపిటేషన్, తల్లిదండ్రులు.. పిల్లలపై ప్రేమ చూపించకుండా కఠినంగా వ్యవహరించడం లాంటి కారణాల వల్ల విద్యార్థులు ఈ సూసైడ్ మార్గాన్ని ఎంచుకుంటున్నారనేది నిపుణుల వాదన. ఈ ప్రస్తుత విద్యా సంవత్సరంలో 20మంది ఇంటర్ విద్యార్థులు సూసైడ్ చేసుకున్నారు. ఎవరైనా విద్యార్థి.. కాలేజీ, స్కూల్ లో ఆత్మహత్య చేసుకుంటే.. ఆ యాజమాన్యాన్ని అరెస్టు చేయాలని చైల్డ్ రైట్ యాక్టివిటీస్ సంస్థలు చెబుతున్నాయి.