చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి ప్రాణి తనను తాను రక్షించుకునేలా వాటి శరీర నిర్మాణం రూపొందించబడుతోంది.

బ్రెజిల్ లో ముళ్లపంది దెబ్బకు అంత పెద్ద పాము ఎలా ప్రాణాలమీదకు తెచ్చుకుందో యూట్యూబ్ లో చూశాం కదా.. గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఇదే వైరల్ వీడియోగా మారింది.

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

ముళ్లు గుచ్చుకున్న ఆ పామును చూసి అందరూ తెగ బాధపడిపోయారు. ఇంతకీ అంత చిన్న ముళ్ల పంది భయంకరమైన పాముకు ఎలా చుక్కలు చూపించింది. అదే ప్రకృతి మహిమ. చీమ నుంచి ఏనుగు వరకు ప్రతి ప్రాణి తనను తాను రక్షించుకునేలా వాటి శరీర నిర్మాణం రూపొందించబడుతోంది.

ఇక్కడ చిన్నగా ఉన్న ముళ్ల పంది ప్రాణభయంతోనే పాముపై దాడికి దిగింది. ఈ వీడియో చూస్తే ముళ్ల మంది తన ఈకలు, ముళ్లతో ఎలా తన దగ్గరికి వచ్చేవారిపై దాడికి దిగుతాయో స్పష్టంగా తెలుస్తోంది.