ఓ చిన్నారి చేసిన పనికి 35 పాము పిల్లలు బతికాయి

snake eggs blooms in birbhum west-bengal
Highlights

ఓ చిన్నారి చేసిన పనికి 35 పాము పిల్లలు బతికాయి

ఎవరినైనా పాము కాటేస్తే బాధితుణ్ని హాస్పిటల్‌కు తీసుకెళ్లడంతోపాటు కాటేసిన పామును చంపేస్తాం. దాని గుడ్లు కనిపిస్తే నాశనం చేస్తాం. హాస్పిటల్‌కు తీసుకెళ్లడం వరకూ ఓకే కానీ.. పామును చంపి, దాని గుడ్లను నాశనం చేస్తే జీవవైవిధ్యం దెబ్బతింటుంది. ఆ.. చెప్పొచ్చార్లే అనుకుంటున్నారా.. ఓ చిన్నారి మాత్రం అలా అనుకోలేదు. టీచర్ చెప్పిన ఈ విషయాన్ని గుర్తుంచుకొని పాము కాటుకు గురైన తన తండ్రిని హాస్పిటల్లో చేర్పించింది. పామును చంపబోతున్న వారిని వారించి తన బయాలజీ టీచర్‌ని పిలిచింది. ఆయనొచ్చి పామును పట్టుకొని అడవిలో వదిలిపెట్టారు. ఆ గుడ్లను జాగ్రత్తగా తీసుకెళ్లి ఓ మట్టి పాత్రలో గడ్డివేసి పొదిగేందుకు కావాల్సిన వాతావరణం కల్పించారు. అలా 53 రోజులు వాటిని పొదిగిస్తే.. గుడ్లను ఒక్కో పాము పిల్ల బయటకొచ్చింది. 35 పాము పిల్లల్ని అటవీశాఖాధికారుల సాయంతో గత మంగళవారం దగ్గర్లోని చెరువులో వదిలిపెట్టారు. ఈ ఘటన బెంగాల్లోని బీర్భూమ్ జిల్లా సురీ ప్రాంతంలో జరిగింది. పాము గుడ్లను పొదిగించిన టీచర్ దీనబంధు ప్రయత్నాన్ని డీఎఫ్‌వో హరికృష్ణన్ ప్రశంసించారు. టీచర్ చెప్పిన విషయాన్ని గుర్తుంచుకొని పామును చంపకుండా అడ్డుకున్న ఆ పసిదాన్ని సైతం మెచ్చుకున్నారు.

                               

loader