గుజరాత్‌లోని అమ్రేలీ జిల్లాలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఒక బహిరంగ సభలో అవమానం ఎదురైంది. ఎవరో ఆగంతకుడు వందేమాతరం అని అరుస్తూ ఆమె మీదకు అంటూ విసిరాడు. ప్రధాని మోడీ ప్రభుత్వం మూడేళ్ల పాలన సందర్భంగా స్మృతి గుజరాత్‌లో అమ్రేలిలోని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది.
గుజరాత్లోని అమ్రేలీ జిల్లాలో కేంద్ర జౌళి శాఖ మంత్రి స్మృతి ఇరానీకి ఒక బహిరంగ సభలో అవమానం ఎదురైంది. ఎవరో ఆగంతకుడు వందేమాతరం అని అరుస్తూ ఆమె మీదకు అంటూ విసిరాడు. ప్రధాని మోడీ ప్రభుత్వం మూడేళ్ల పాలన సందర్భంగా స్మృతి గుజరాత్లో అమ్రేలిలోని కార్యక్రమంలో పాల్గొని ప్రసంగిస్తున్నపుడు ఈ సంఘటన జరిగింది.
మంత్రి ప్రసంగం కొనసాగుతున్నపుడు అతగాడు లేచి , వందేమాతరం అని అరుస్తూ స్టేజీ మీదకు కొన్ని గాజులు విసిరాడు.అయితే, స్టేజీ దూరంగా ఉండటంతో గాజులు మంత్రి మీద పడలేదు.
గాజులు విసిరిన ఆగంతకుని పేరు కేతన్ కశ్వాల (25) అని, అతనిని వెంటనే అదుపులోకి తీసుకోవడం జరిగిందని పోలీస్ సూపరింటెండెంట్ జగ్ దీష్ పటేల్ చెప్పారు.
పోలీసులు కాశ్వాలనుతీసుకుపోతున్నపుడు మంత్రి వారించారు. ’ఆయన్ని కార్యక్రమంలో ఉండనీయండి, గాజలు విసరనీయండి. వాటిని నేను అతని భార్యకు కాన్కగా పంపిస్తాను,’ అని మంత్రి పోలీసులకు నచ్చచెప్పారు.
రైతులకు రుణమాఫీ కల్పించాలనే డిమాండ్తో కేతన్ మంత్రిపై గాజులు రువ్వినట్లు స్థానిక కాంగ్రెస్ ఎంఎల్ఎ పరేశ్ ధనాని తెలిపారు.
