నూజివీడు ఐఐఐటిలో విద్యార్థుల స‌స్పెన్ష‌న్ కు సంబంధించి ఆంధ్ర ప్రదేశ్ విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాస‌రావుకీల‌క నిర్ణ‌యం తీసుకున్నారు.

విద్యార్థులతో, అధ్యాప‌కుల‌తో  మంత్రి గంటా సుదీర్ఘమయిన చర్చ లుజరిపారు.

ఆర్జీయూకేటీ వైస్ చాన్స‌ల‌ర్ మంత్రిని కలుసుకున్నారు. విద్యార్తుల మీద తీసుకోవలసిన చర్యల గురించి, ఇలాంటి సంఘటలను పునరావృతం కాకుండా ఉండేందుకు తీసుకోవలసిన చర్యల గురించి చర్చించారు.

సుదీర్ఘ చ‌ర్చ‌ అనంత‌రం విద్యార్థులపై చ‌ర్య‌లు తీసుకోవాలని మంత్రి ఆదేశించారు. అపుడే క్రమశిక్షణ  అలవడుతుందని భావించారు.

వివరాలు ఇవి

జూనియ‌ర్ల‌పై దాడికి పాల్ప‌డ సీనియ‌ర్ విద్యార్థుల‌ను 5 స్థాయిల్లో విభ‌జించి శిక్ష‌ణను ఖ‌రారు చేశారు.

నేర తీవ్ర‌త దృష్ట్యా విద్యార్థుల‌పై చ‌ర్య‌లు  తీసుకోవాలని కమిటి సూచించింది.

తొలి  6 గురు విద్యార్థుల‌కు టీసీలు ఇచ్చేయాల‌ని నిర్ణ‌యించారు.

మ‌రొ 9 మందిక్ి ఒక సంవత్సరం పాటు స‌స్పెన్ష‌న్ ఉంటుంది. అయితే ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తిస్తారు.

 3,4,5 కేట‌గిరీలో వున్న విద్యార్థుల‌కు 2 నెల పాటు స‌స్పెన్ష‌న్,  ప‌రీక్ష‌ల‌కు అనుమ‌తి ఉంటుంది,ః. 
టీసీలు ఇవ్వ‌డం అనేది అసాధార‌ణ‌మైన విష‌యం

ఇటీవ‌ల యూనివ‌ర్శ‌ిటీలు, విద్యాల‌యాల్లో జ‌రుగుతున్న సంఘ‌ట‌నల నేప‌థ్యంలో ఈ తీవ్ర నిర్ణ‌యం అవసరమయింది.

విచార‌క‌ర‌మైన‌ప్ప‌టికీ ఇలాంటి సంఘ‌ట‌న‌లు జ‌ర‌గ‌కూడ‌ద‌నే అసాధార‌ణ నిర్ణ‌యం తీసుకున్నామని  మంత్రి గంటా శ్రీనివాస‌రావు తెలిపారు.

ఇలాంటి ఘ‌ట‌న‌లు పున‌రావృత‌మైతే చ‌ర్య‌లు ఇలానే వుంటాయ‌ని స్ప‌ష్టం  చేశారు.