Asianet News TeluguAsianet News Telugu

సెల్ఫీ అమ్మాయిలను దూరంగా నెడుతున్న జేసుదాస్

ఆయన గాత్రం మధురం,  అలోచనలన్నీ మలినం అంటున్న కేరళ యువత

singer Jesusdas reveals his hatred for selfies by girls and women

సంఘపరివార్ కు, వాలెంటైన్ డే లను వ్యతిరేకించే వాళ్లందరికి  కేరళనుంచి చల్లటి వార్త

 

ప్రఖ్యాత నేపథ్యం గాయకుడు జేస్ దాస్ సెల్ఫీలతో చికాకు పడుతున్నారు.

 

అభిమానం పేరుతో మీద పడి  అమ్మాయిలుసెల్ఫీలు తీసుకోవడమేమిటి వికారంగా అని ఫీలవుతున్నారు. 

 

సెల్ఫీలకోసం వచ్చే అమ్మాయిలను ఆయన దూరంగా పెడుతున్నారు. ఇది వికారపు అలవాటు అంటున్నారు.

 

76 యేళ్ల జేసుదాస్ కేరళకే చెందినా, ఆయన సుమధుర గాత్రంతో అసేత హిమాచలాన్ని తన వైపు తిప్పుకున్నారు. క్రైస్తవుడే అయినా, ఆయన పాడిన హిందూ భక్తి గేయాలకు ఏనలేని  ప్రజాదరణ లభించింది. అందుకే ఆయన చేసే ప్రకటనలను అంతా సీరియస్ గా తీసుకుంటారు. అయితే, ఆయన గాత్రమెంత మధురమో ఆయన ఆలోచనలంత  పాత కంపు కొడుతున్నాయని  కేరళ యువతీ యువకులు ఆయన మీద కారాలు మిరియాలు నూరుతున్నారు.

 

ఎందుకంటే, ప్రేమను ఎంత ఉదాత్తంగా ఆయన గాత్రం కీర్తించిందో చిత్ చోర్ (1976)లాంటి చిత్రాలు  చూసిన వాళ్లందరికి తెలుసు. అయితే, దాని వెనక మురికి ఉందని ఏడాది కొకసారి బయటపెడుతున్నాడు.

 

సెల్ఫీల కోసం ఈ కాలం అమ్మాయిలు, అబ్బాయిలు ఎగబడటం ఆయన కేమాత్రం నచ్చడంలేదు.  గతంలో అమ్మాయిలేసుకుంటున్న జీన్స్ కవ్వించేలా ఉంటున్నాయని ఘాటైన వ్యాఖ్య చేసి పెద్ద దూమరం లేపిన సంగతి తెలిసిందే.

 

ఇపుడు సెల్ఫీ ల మీద  ప్రకటన చాలా వివాదం సృష్టిస్తూఉంది. సంస్కృతి,పెంపకం  గురించి ఈ మధ్య స్పష్టమయి స్టాండ్ తీసుకుంటూ ఉండటం అందర్ని ఆశ్చర్యం పరుస్తూ ఉంది.

 

ఆయన చేసిన వ్యాఖ్యలను ఒక మలయాళీ దినపత్రికలో  సోమవారం నాడు అచ్చయ్యాయి.

 

ఫోటోలు తీసుకోవడం గురించి తనకెలాంటి అభ్యంతరం లేదని చెబుతూ  రాసుకుంటూ పూసుకుంటూతీసుకునే సెల్ఫీలంటే తనకేమాత్రం ఇష్టం లేదని, అదంటే చాలా చికాకని జేసు దాస్ అన్నారు.



‘ఈ సెల్ఫీలనేవి వచ్చాక, అంతా మీద పడేలా వచ్చి ఫోటోలు తీసుకోవాలనుకుంటున్నారు.రాసుకుని పూసుకునే టట్లయితే సెల్ఫీల కోసం నేను పోజిచ్చేదిలేదని చాలాస్పష్టంగా అమ్మాయిలకు, అబ్బాయిలకు చెప్పేశాను.’అని ఆయన అన్నారు.

 

ఆయన ఇంకా ఇలా అన్నారు.

 

‘1980కంటే ముందు ఫోటోతీసుకుంటామని చెబుతూ అమ్మాయిలు ఇలా దగ్గరకువచ్చేవారే కాదు. వారిలో కొంత బిడియం, భయం భక్తి ఉండేవి.’‘ ఈ పద్దతి గురించయి నేనేమీ తప్పులు పట్టడం లేదు. ఉన్నవిషయం చెబుతున్నానంతే,’అని ముక్తాయింపు  కూడా ఇచ్చారు.

 

‘ స్వయంగా భర్తలే పరిచయం చేసిన ఆరోజుల్లో కొద్దిగా దూరంగానే ఉండేవారు.  ఇపుడాపరిస్థితి పోయింది,’ అన్నారు.

 

2004 లో కూడా ఆయన ఇలాగే జీన్స్ వివాదం సృష్టించారు.

 

‘అమ్మాయిలా జీన్స్ వేసుకుని వికారం కల్గిస్తూ ఇతరను చాలా ఇబ్బంది పెడుతున్నారు.మనం మనకు పరిపడే దుస్తులేసుకోవాలి.శరీరం మీద వేటిని దాచాలో వాటిని దాచాలి,’ అని పబ్లిక్ గానే అనేశాడు.

 

అంతేకాదు, ‘ఒక స్త్రీ అందం అమె హుందాతనంలో ఉంది,కవ్వింపులో కాదు,’ అని కూడా వివాదం సృష్టించారు.

 

Follow Us:
Download App:
  • android
  • ios