ఐసీసీ చైర్మన్ పదవికి రాజీనామా చేసిన శశాంక్ మనోహర్

అధికారికంగా అంతర్జాతీయ క్రికెట్ ప్రారంభమై నేటితో వందేళ్లు అవుతోంది. కానీ, ఈ రోజే అంతర్జాతీయ క్రికెట్ కు ఊహించిన షాక్ తగిలింది. 

Add Asianetnews Telugu as a Preferred SourcegooglePreferred

క్రికెట్ లో మిస్టర్ క్లీన్ గా పేరున్న వ్యక్తి శశాంక్ మనోహర్. ఇప్పుడో సంచలన నిర్ణయం తీసుకున్నారు.

ఈ రోజు ఆయన ఐసీసీ( అంతర్జాతీయ క్రికెట్ మండలి) చైర్మన్ పదవికి రాజీనామా చేశారు.

కొంతకాలంగా బీసీసీఐ కి ఐసీసీ మధ్య ఏ విషయంలోనే ఏకాభిప్రాయం లేకుండాపోయింది.

ప్రపంచంలోనే అత్యంత ధనవంతమైన క్రికెట్ మండలిగా పేరున్న బీసీసీఐ చెప్పినట్లే ఐసీసీ వినాల్సిన పరిస్థితి వస్తోంది.

దీంతో ఐసీసీ చైర్మన్ గా ఉన్న శశాంక్ కు ఇది తలనొప్పిగా మారింది. అందుకే రాజీనామా చేసినట్లు తెలిసింది.

గతేడాది బీసీసీఐ అధ్యక్ష పదవికి రిజైన్ చేసిన శశాంక్ ఐసీసీ తొలి స్వతంత్ర ఛైర్మన్‌గా ఏకగ్రీవంగా ఎన్నికైన విషయం తెలిసింది.