దక్షిణ మధ్య రైల్వే..పండగ స్పెషల్

SCR to run 96 additional trains to meet festive rush
Highlights

  • మరికొద్ది రోజుల్లో అతి పెద్ద పండుగలు దసరా, దీపావళి రానున్నాయి
  • ప్రయాణికుల కోసం రైల్వే శాఖ ప్రత్యేక రైళ్లు
  • సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా 18 సూపర్  ఫాస్ట్ రైళ్ల ఏర్పాటు

వచ్చేది పండగల సీజన్. మరికొద్ది రోజుల్లో అతి పెద్ద పండుగలు దసరా, దీపావళి రానున్నాయి. ఈ పండగలను దేశ వ్యాప్తంగా ప్రజలు ఆనందంగా జరుపుకుంటారు. ఈ పండగలకు.. ప్రజలు ఎక్కడెక్కడి నుంచో తమ సొంత ఉళ్లకు బయలుదేరి వెళుతుంటారు. దీంతో రద్దీ కాస్త ఎక్కువగానే ఉంటుంది.  ఇప్పటికే చాలా మంది తమ ఊళ్లకు వెళ్లేందుకు రైలు రిజర్వేషన్లు కూడా చేయించుకున్నారు. ఇంకొంత మంది రిజర్వేషన్లు దొరకలేదే అని బాధపడుతున్నారు. అలాంటి వారి కోసమే.. రైల్వే శాఖ  ఓ నిర్ణయం తీసుకుంది.

 

అక్టోబర్, నవంబర్ నెలల్లో.. 96 అదనపు రైళ్లను నడిపేందుకు నిర్ణయం తీసుకుంది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని సికింద్రాబాద్, విజయవాడ, తిరుపతి, జైపూర్, రక్సల్ ప్రాంతాలకు ఈ రైళ్లను నడపనున్నట్లు రైల్వే శాఖ అధికారులు తెలిపారు.

 

అంతేకాకుండా సికింద్రాబాద్ నుంచి విజయవాడకు ప్రతి ఆదివారం ప్రత్యేకంగా 18 సూపర్  ఫాస్ట్ రైళ్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. ఈ సూపర్ ఫాస్ట్ రైలు.. నల్లొండ, మిర్యాల గూడ, గుంటూరులలో మాత్రమే ఆగుతుంది. అదేవిధంగా తిరుపతి నుంచి కాకినాడకు కూడా ప్రత్యేకంగా ప్రతి ఆదివారం 9 రైళ్లను నడపనున్నారు. తిరుపతి నుంచి నాగర్సోల్  ప్రాంతాకు 16 స్పెషల్ వీక్లీ ట్రైన్స్ ఏర్పాటు చేస్తున్నామని అధికారులు చెప్పారు. ఈ రైలుని ప్రతి శుక్రవారం సాయంత్రం తిరుపతి నుంచి బయలు దేరి వెళుతుంది. తిరిగి శని వారం నాగర్సోల్ నుంచి తిరుపతికి బయలు దేరి వెళుతుంది. ఈ రైళ్లు.. బేగంపేట్, లింగంపల్లి స్టేషన్లలో కూడా ఆగుతుంది.

 

ప్రతి బుధవారం తిరుపతి నుంచి హెచ్ ఎస్ నాందేడ్ కి 18 రైళ్లు నడపనున్నారు. బుధవారం సాయంత్రం సికింద్రాబాద్ నుంచి బయలు దేరిన ఈ రైలు.. కామారెడ్డి, నిజామాబాద్, ఒంగోలు, ఖమ్మం ప్రాంతాల గుండా వెళుతుంది.

 

అదేవిధంగా 8 జంట రైళ్లను ప్రతి ఆదివారం హైదరాబాద్ నుంచి జైపూర్ కి నడపనున్నారు. అలాగే సికింద్రాబాద్ నుంచి రక్సల్ కు 10 ప్రత్యేక రైళ్లను అలహాబాద్, వారణాసి ప్రాంతాల మీదుగా నడుపుతారు.

 

 

loader