Asianet News TeluguAsianet News Telugu

సౌదీలో కొత్త చట్టం: వర్కర్లకు మంచిరోజులు

వరుసగా మూడు నెలలపాటు జీతాన్ని ఇవ్వకపోయినా, ఇంట్లో ఎవరైనా వలస  వచ్చిన  వారిని అవమానించినా, హింసించినా అక్కడ పనిమానేసి వేరే చోట పనిచేయొచ్చు. అలాగే సౌదీలో అడుగుపెట్టిన 30 రోజుల్లోపు రెసిడెన్సీ వీసాను యజమాని వలసదారుకు తెప్పించలేకపోయినా ఈ నిబంధన వర్తిస్తుంది.

Saudi brings about new law to protect the rights of immigrants

సౌదీలో కొత్త చట్టం వచ్చింది. ఉద్యోగాలను వెదుక్కంటూ వచ్చిన భద్రతకు సంబంధించిన చట్టం ఇది. ఇది సౌదీవర్కర్లకు శుభవార్తే. చట్టాలను కఠినంగా అమలు చేస్తుందనే పేరు సౌదీకి ఉంది. అందువల్ల బతుకుదెరువు వెదుక్కుంటూ  తెలంగాణా, ఆంధ్ర తదితర ప్రాంతాలనుంచి వెళ్లి యజమానుల చేతుల్లో నరకయాతన పడుతున్న వర్కర్లకు ఇది మేలుచేస్తుందని ఆశించివవచ్చు. ఈ చట్టం కూడా కఠినంగా అమలవుతుంది.

చట్టంలో చాలా కఠిన నిబంధనలున్నాయి.  ఈ సారి ఈ కఠిన నిబంధనలు దేశానికి వలస వచ్చిన విదేశీయులకు కాక స్వదేశీ పౌరులకు సంబంధించి కావడం విశేషం.

 వలసదారులను హింసించినా, చిత్రహింసలకు గురి చేసినా  కఠిన శిక్షలు ఉంటాయని సౌదీ ప్రభుత్వం స్పష్టం చేసింది.

 అంతే కాకుండా వలసకూలీలు తమ యజమానిని మార్చుకునే అవకాశాన్ని కూడా సౌదీ కల్పిస్తోందని లేబర్ మినిస్టర్ అలీ అల్ ఘాఫీ తెలిపారు.

వరుసగా మూడు నెలలపాటు జీతాన్ని ఇవ్వకపోయినా, ఇంట్లో ఎవరైనా వలసదారును అవమానించినా, హింసించినా అక్కడ పనిమానేసి వేరే చోట పనిచేయొచ్చు .అలాగే సౌదీలో అడుగుపెట్టిన 30 రోజుల్లోపు రెసిడెన్సీ వీసాను యజమాని వలసదారుకు తెప్పించలేకపోయినా ఈ నిబంధన వర్తిస్తుందన్నారు.

కొత్త నిబంధనల ప్రకారం వర్కర్లను యాజమాని , వర్కర్ అంగీకారం లేకుండా మరొ క యజమ ానికి బదిలీచేయడం కూడా ఇక చెల్లదు.

Follow Us:
Download App:
  • android
  • ios