Asianet News TeluguAsianet News Telugu

చిన్నమ్మతో జైళ్లో ఆ పనులు చేయిస్తారట

తమిళనాడు సీఎం అవ్వాలనుకున్న శశికళ కల చెదిరిపోయింది. అమ్మ వెళ్లాక కూడా అక్రమాస్తుల కేసు చిన్నమ్మను వదలిపెట్టలేదు. కోర్టు తీర్పుతో చిప్పకూడు తినే పరిస్థితి శశికళకు వచ్చేసింది.

sasikala jail diary

తమిళనాడు సీఎం అవ్వాలనుకున్న శశికళ కల చెదిరిపోయింది. అమ్మ వెళ్లాక కూడా అక్రమాస్తుల కేసు చిన్నమ్మను వదలిపెట్టలేదు. కోర్టు తీర్పుతో చిప్పకూడు తినే పరిస్థితి శశికళకు వచ్చేసింది.

ఈ కేసులో ఆమెకు న్యాయస్థానం నాలుగేళ్ల జైలుశిక్ష, రూ.10కోట్ల జరిమానా విధించిన సంగతి తెలిసిందే. ఇక నాలుగేళ్ల పాటు ఆమె కర్ణాటకలోని పరప్పణ జైలులో గడపాల్సిందే.

అయితే జైలులో తనకు ప్రత్యేక సదుపాయాలు కావాలని శశికళ అధికారులకు విజ్ఞప్తి చేశారు. ఏసీ గది, ఇంటి ఆహారం, టీవీ, మినరల్‌ వాటర్‌ ఇలా తన కోర్కెల చిట్టా బయట పెట్టారు. అయితే దీనిపై స్పందించన జైలు అధికారులు మాత్రం ఆమె జైలులో చేయాల్సిన పనులను మాత్రం చాలా చక్కగా చెప్పారు.

జైల్లో అగర్‌బత్తీలు, కొవ్వొత్తులను ఆమెతో తయారు చేయిస్తామని, అలా చేసినందుకు ఆమెకు రోజుకు రూ.50 ఇస్తామని  అధికారులు తెలిపారు. ఉదయం 6.30కి టిఫిన్ , 11.30కి లంచ్ , సాయంత్రం 4 గంటలకు టీ, రాత్రి 6.30కి భోజనాన్ని అందిస్తామని వెల్లడించారు.

Follow Us:
Download App:
  • android
  • ios