స్మోకింగ్ నుంచి దూరంగా ‘‘పరిగెత్తండి’’

స్మోకింగ్ నుంచి దూరంగా ‘‘పరిగెత్తండి’’

‘‘పొగతాగడం ఆరోగ్యానికి హానికరం.. ప్రాణాంతం’’. ఈ విషయం అందరికీ తెలుసు కానీ.. పొగతాగడం మాత్రం మానరు. అంతెందుకు పొగతాగడం మంచిది కాదని వాళ్లు తాగే సిగరెట్ పెట్ట మీద కూడా రాసి ఉంటుంది. దానిని చూసినా పట్టించుకోరు. ఎందుకంటే.. ఒక్కసారి సిగరెట్ కి బానిసగా మారితే.. దాని బారి నుంచి బయటపడటం అంత సులువైన విషయం కాదు. ఎంత నియంత్రించుకుందామని అనుకున్నా.. దానివైపే మనసు లాగేస్తూ ఉంటుంది. అయితే.. ఒక చిన్న ఆరోగ్య చిట్కా ఫాలో అయితే.. దీని నుంచి సులభంగా బయటపడవచ్చని చెబుతున్నారు నిపుణులు.

రోజూ కొద్దిసేపు పరిగెడితే దాని నుంచి బయటపడొచ్చని అంటున్నారు నిపుణులు. ఆ కొద్దిసేపు పరుగుతో పొగతాగే అలవాటు దూరమవుతుందని చెబుతున్నారు. సెయింట్‌ జార్జ్‌ యూనివర్శిటీ ఆఫ్‌ లండన్‌కి చెందిన నిపుణులు ఎలుకలపై నికోటిన్‌ను ప్రయోగించి పరిశోధన చేశారు. అందులో పరిగెత్తడం లాంటి వ్యాయామాలు చేస్తే నికోటిన్‌ ఎక్స్‌ పోజర్‌ తగ్గి పొగతాగడం మానేసేందుకు తోడ్పడుతుందని వెల్లడైంది. నికోటిన్‌ను ప్రయోగించిన తర్వాత ఎలుకలను రెండు చక్రాలపై పరిగెత్తించేలా చేస్తే ఫలితం కన్పించిందనినిపుణులు పేర్కొన్నారు.రోజంతా ఎక్కువ సేపు వ్యాయామం చేసే బదులు కాసేపు పరిగెత్తినా చాలా ప్రయోజనం ఉంటుందని తమ పరిశోధనలో తేలిందని డాక్టర్‌ అలెక్సిస్‌ బెయిలీ తెలిపారు.

 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page