Asianet News TeluguAsianet News Telugu

పవన్ కల్యాణ్ ని మళ్లీ గిల్లిన రామ్ గోపాల్ వర్మ

పవర్ స్టార్ మీద పవర్ ఫుల్ సటైర్ వదిలిన రామ్ గోపాల్ వర్మ

RGV releases a video to prove  pawan kalyan politics is a drama
 
 

పవర్ స్టార్ , జనసేన అధిపతి  పవన్ కల్యాణ్ ను గిల్లు కోవడం మీద సినీదర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సరదా. పవన్ కల్యాణ్ లో ఏదో డ్రామా ఉందని రుజువు చేసేందుకు ఆయన చాలా రోజులుగా ప్రయత్నిస్తున్నారు. ఇందులో భాగంగా ఈ రోజు  ఒక సటైర్ వీడియో ఫేస్ బుక్ లో పెట్టారు.పవన్ కల్యాణ్ దంతా డ్రామా అని చెప్పేందుకు ఆయన ఈ వీడియోతో ప్రయత్నించారు.  రాష్ట్ర విభజన జరిగినపుడు బాధతో 11 రోజులు అన్నం ముట్టుకోలేదని పవన్ కల్యాణ్ ఒక సభలో చెప్పారు. వర్మ ఈ వీడియో పట్టారు. ఇది అబద్దం, అసంబద్దం అని ఈ వీడియో ద్వారా వర్మ చెబుతున్నారు. ఈకామిక్ వీడియో వైరల్ అయింది.

 

Follow Us:
Download App:
  • android
  • ios