కర్నాటకలో వెనకబడిన ప్రాంతం హుబ్లీ రైల్వేజోన్ అయిందిఅలాగే ఆంధ్ర కూడా గుంతకల్ జోన్ కోసం వత్తిడి తేవాలిఅన్ని వున్న విశాఖ కే రైల్వే జోన్ కూడాఇస్తారాఅన్యాయమంటున్న రాయలసీమ యువకులు
గుంతకల్ రైల్వే జోన్ కావాలన్న డిమాండ్ మెల్లిగా రాయలసీమలో ఉపందుకుంటూ ఉంది. విద్యార్థులు, యువకులు ఈ డిమాండ్ తో ఉద్యమం బాటపడుతున్నారు. గంతకల్లు రైల్వే జోన్ సాధించేందుకు గుంతకల్ రైల్వే జోన్ సాధన సమితి ఏర్పాటయింది. సమితి సమితి కన్వీనర్ రాజ శేఖర్ రెడ్డి ఆధ్వర్యంలో అదివారం నాడు అనంతపురం టవర్ క్లాక్ నుండి రైల్వే స్టేషన్ వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. తర్వాత రైల్వే స్టేషన్ ముందు ధర్నా నిర్వహించారు.
ఈసంధర్బంగా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ రాయలసీమను ప్రస్తుత ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యంచేస్తున్నదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆర్థికాభివృద్ధి అజండాలో రాయలసీమ లేదని, ఎంతసేపు ప్రభుత్వం అమరావతి,విశాఖ ల గురించి మాట్లాడుతూ ఉందని విమర్శించారు.ఇదే దోరణి కొత్త రైల్వే జోన్ విషయంలో కూడా కనిపిస్తుందని రెడ్డి అన్నారు.
‘అభివృద్ధి చెందిన విశాఖపట్నం కు కాకుండా కరువు తో వెనకబడ్డ గుంతకల్ డివిజన్ కేంద్రాన్ని రైల్వే జోన్ చేయాలి .జోన్ వల్ల కరువు ప్రాంతంలో కొన్ని ఉద్యోగాలన్న వస్తాయి. ఈ ప్రాంతం లో అనేక వందల ఎకరాల రైల్వే భూమి ఉంది.గుంతకల్ పక్కనే హంద్రీనీవా జలాలు ఉన్నాయి .గుంతకల్ కింద ఉన్న ఒక స్టేషన్ హుబ్లీ ఈ రోజు జోన్ స్థాయికి కర్ణాటక తెచిందన్నారు.బెంగూళూరు కాకుండా వెనకబడిన హుబ్లీకి డివిజన్ ఇచ్చినట్ల ఇక్కడ కూడా అన్నీ ఉన్న విశాఖ కాకుండా ఏమీ లేని రాయలసీమ కు చెందిన గుంతకల్ కు రైల్వే జోన్ ఇవ్వాలని,’ ఈ కార్యక్రమం పాల్గొన్న రాయలసీమ స్టూడెంట్ ఫోర్స్ భార్గవ్, పిఎస్ వొ రెడ్డి,నాగరాజు,లోకేశ్ రెడ్డి,సీనప్ప తదితర నాయకులు పేర్కొన్నారు.
