మళ్లీ పవన్ కళ్యాణ్ పై రాంగోపాల్ వర్మ వరుస ట్వీట్లు

ram gopal varma Serious Twitter Comments on pawan kalyan
Highlights

ట్విట్టర్ ద్వారా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి చేత తిట్టించి మరో వివాదానికి తెరలేపాడు. అయితే తాను చేసింది తప్పేనంటూ పవన్ కళ్యాణ్‌కి, మెగా కుటుంబ సభ్యులకీ, ఫాన్స్‌కీ అందరికీ వర్మ క్షమాపణ చెప్పాడు.   ఇకపై పవన్ పై గానీ ఆయన కుటుంబ సభ్యులపై  గానీ ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయనని తన తల్లి మీద ఒట్టేసి చెబుతున్నానని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.

అయితే ఇలా క్షమాపణలు చెప్పిన తర్వాత కూడా పవన్ కళ్యాణ్ మళ్లీ తనను విమర్శించడంతో ఈ వివాదంలో వర్మ మొదటికి వచ్చారు. తాజాగా తన తల్లిపై వేసిన ఆ ఒట్టు తీసి గట్టున పెడుతున్నట్లు వర్మ ట్వీట్ చేశాడు. దానికి కారణాన్ని కూడా అదే ట్విట్టర్ లో వివరించాడు. ‘‘నేను చేసిన పనికి సారీ చెప్పి పీకే మీద ఇక కామెంట్ చెయ్యనని మా అమ్మ మీద ఒట్టు వేశాను. ఆ తర్వాత కూడా నేను చంద్రబాబు, లోకేష్, శ్రీని రాజు, ఆర్కే, రవిప్రకాష్, మూర్తి కూటమిలో ఉన్నానని ఆరోపించడం మూలాన మా అమ్మ అంగీకారంతో ఇప్పుడు నా ఒట్టు తీసి గట్టు మీద పెట్టాను’’ అని  వర్మ వెల్లడించారు. ఆ తర్వాత ఫిల్మ్ చాంబర్ లో జరిగిన పరిణామాలపై వరుసగా మరి కొన్ని ట్వీట్ లు చేశాడు వర్మ.  లాయర్ల కంటే ఎక్కువగా ఒక వ్యక్తి మాట్లాడటం నేను మొదటి సారి చూస్తున్నా. ఆయనకు ఉన్న డబ్బుతో ఒక మంచి లాయర్‌ను నియమించుకోవాల్సిందంటూ ట్వీట్ చేశారు. ఇలా మళ్లీ పవన్, వర్మల వివాదం మొదటికొచ్చింది.

ట్విట్టర్ వేదికగా ఎప్పుడూ వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో దర్శకుడు రాంగోపాల్ వర్మ ఎప్పుడూ ముందుంటాడు. తాజాగా పవన్ కళ్యాణ్ ను శ్రీరెడ్డి చేత తిట్టించి మరో వివాదానికి తెరలేపాడు. అయితే తాను చేసింది తప్పేనంటూ పవన్ కళ్యాణ్‌కి, మెగా కుటుంబ సభ్యులకీ, ఫాన్స్‌కీ అందరికీ వర్మ క్షమాపణ చెప్పాడు.   ఇకపై పవన్ పై గానీ ఆయన కుటుంబ సభ్యులపై  గానీ ఎలాంటి నెగెటివ్ కామెంట్స్ చేయనని తన తల్లి మీద ఒట్టేసి చెబుతున్నానని వర్మ చెప్పిన విషయం తెలిసిందే.

loader