విరుష్క జంటకి మోదీ గిఫ్ట్ ఎంటో తెలుసా?

First Published 23, Dec 2017, 5:33 PM IST
prime minister narendra modi gives a special gift to virushka couple
Highlights
  • ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటైన విరుష్క జంట
  • ఢిల్లీలో రిసెప్షన్ నిర్వహించిన విరుష్క జంట
  • రిసెప్షన్ కి హాజరైన ప్రధాని నరేంద్రమోదీ

టీం ఇండియా కెప్టెన్ విరాట్ కొహ్లీ, బాలీవుడ్ అందాల తార అనుష్క శర్మ.. ఇటీవలే వివాహ బంధంతో ఒక్కటయ్యారు. పెళ్లి ఇటలీలో చేసుకోగా గురువారం దేశరాజధాని ఢిల్లీలో గ్రాండ్ గా రిసెప్షన్ ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఈ రిసెప్షన్ కి ప్రధాని నరేంద్రమోదీ హాజరై.. నూతన దంపతులకు శుభాకాంక్షలు తెలిపారు.

రిసెప్షన్ కి వచ్చే అతిథులు ఎవరూ.. గిఫ్ట్ లు తేవద్దని విరుష్క జంట మరీ మరీ చెప్పారట. అయినప్పటకీ ప్రధాని మోదీ.. నూతన దంపతులకు గిఫ్ట్ తీసుకువచ్చారు. ఇంతకీ ఆ గిఫ్ట్ ఏంటో తెలుసా..? రోజా పూలు. కాకపోతే.. ఆ పూలకి ఓ ప్రత్యేకత ఉంది.  ఆ రెండు పూలను మోదీ విదేశాల నుంచి తెప్పించారట. ఒక్కో పువ్వు ఖరీదు రూ.5లక్షలు. ఆ పువ్వు త్వరగా ఎండిపోదట. అంతేకాకుండా ఏడు రోజుల పాటు దాని నుంచి సువాసనలు వెదజల్లుతాయట. దేశ ప్రధాని హోదాలో ఉన్న వ్యక్తి.. బహుమతి ఇస్తే.. అది సాధారణంగా ఉండదని రుజువైంది. ఆ  బహుమతి అందుకున్న విరుష్క జంట ఎంతో సంతోషించింది.
 

loader