రాష్ట్రపతి రామ్ నాథ్ కోవింద్ శీతాకాల విడిది పర్యటన ఖరారైంది. ఈ నెల 24న ఉదయం చెన్నై నుంచి బేగంపేట విమానాశ్రయానికి చేరుకోనున్నారు. అక్కడి నుంచి సికింద్రాబాద్ బొల్లారంలోని రాష్ట్రపతి నిలయానికి వెళ్లనున్నారు. అదే రోజు రాత్రి రాష్ట్రపతి గౌరవార్థం గర్నర్ నరసింహన్ రాజభవన్ లో నిర్వహించే విందుకు హాజరౌతారు

ఈనెల 26 వరకు బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంలో ఆయన ఉంటారు. అనంతరం 27వ తేదీన ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి బయలుదేరి వెళ్లనున్నారు. రాష్ట్రపతి పర్యటన ఏర్పాట్లపై తెలంగాణ ప్రభుత్వం శుక్రవారం ఉన్నత స్థాయి సమావేశం నిర్వహించింది. రాష్ట్రపతికి ఎలాంటి ఇబ్బంది కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేయనున్నారు.