Asianet News TeluguAsianet News Telugu

ఆయన నవరాత్రి మినరల్ వాటర్ ఖర్చు రు. 10 కోట్లు

నవరాత్రి ఉపవాసాల సందర్భంగా ప్రధాని మోదీ తాగిన మంచినీళ్ల ఖర్చు పది కోట్ల రుపాయలట

PM spent 10 crore on mineral water and juices during navratri

ప్రధాని నరేంద్ర మోడీ బాగా భారీ మనిషి.   బట్టల మీదే పెట్టే ఖర్చు భారీ.  తాగే మినరల్ వాటర్ మీద పెట్టే ఖర్చు  కూడా భారీయే. 

 

 దేశం కోసం, దేశ ప్రజల బాగోగులకు అహర్నిశలు పనిచేస్తున్న మన ప్రియతమ ప్రధాని మంచినీళ్ల ఖర్చు కూడా భారీగా కోట్లలోనే ఉందని ఇపుడు వెల్లడయింది.

 

గత ఏడాది నవరాత్రి సందర్భంగా ఆయన ఉపవాసాలున్న సంగతితెలిసిందే. చివరకు గత సెప్టెంబర్ నెలలో అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామో భోజనానికి పిలిస్తే కూడా ఆయన ఉపవాసం కారణంగా కేవలం ఒక గ్లాసెడు వేన్నీళ్లు  సేవించి చర్చల్లో పాల్గొన్నారు.

 

ఇలా ఆయన  తాగిన మంచి నీళ్ల ఖర్చు  అక్షరాల పది కోట్లరుపాయలట. నవరాత్రి సందర్భంగా ఆయన ఉపవాసాలుంటారు. కేవలం పచ్చి మంచి నీళ్లు మాత్రమే తాగుతారు. కాకపోతే, మధ్య మధ్య పళ్లరసంతీసుకుంటారు.

 

ఆయన  తాగే మంచినీళ్ల ఖర్చు  సమాచారం చట్టం పుణ్యాన దేశ ప్రజలకు తెలిసింది. ఆర్ టి ఐ చట్టం కింద ‘జుంటా కా రిపోర్టర్’ అడిగిన ప్రశ్నకు  ప్రధాని కార్యాలయం ఈ సమాచారం అందించింది. కాకపోతే, నీళ్లతో పాటు ఈ పదికోట్లతో పళ్ల రసాలుకూడా కొన్నారని కూడా అధికారులు చెప్పారు.

 

అధికారం చేపట్టిన తర్వాత నవరాత్రి సందర్భాంగా ప్రధాని తాగిన మినరల్ వాటర్ కు, పళ్ల రసాలకు ఎంత ఖర్చయిందో చెప్పాలని ‘జుంటా కా రిపోర్టర్’ అడిగిందట.

Follow Us:
Download App:
  • android
  • ios