కెసిఆర్ కు ప్రధాని మోదీ ఝలక్

కెసిఆర్ కు ప్రధాని మోదీ ఝలక్

తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్ రావు  నేతృత్వంలో అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని కలుసుకునేందుకు టైం లేదని  ప్రధాని కార్యాలయం ముఖ్యమంత్రి కార్యాలయానికి సమాచారం అందించింది.

మెట్రో ప్రారంభోత్సవానికి హైదరాబాద్  ప్రధాని మోదీ ఈ నెల 28న  హైదరాబాద్ వస్తున్న సంగతి తెలిసిందే.

 అదే రోజున ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ప్రధాని మోదీని   అతిముఖ్యమమయిన  రెండు విషయాల మీద కలవాలనుకున్నారు. అవి, ఎస్ సి  వర్గీకరణ,   ముస్లింలకు రిజర్వేషన్లు.

ఈ మధ్య అసెంబ్లీలో ఆయన రెండు అంశాలమీద ప్రతిపక్షానికి హామీ ఇస్తూ తాను ప్రధాని అప్పాయంట్ మెంట్ కోరతానని,  అఖిల పక్షనేతలను తీసుకెళ్తానని చెప్పారు.

ఈ విషయం మీద తన నిజాయితీని నిరూపించుకునేందుకు ముఖ్యమంత్రి  అఖిల  పక్ష నేతలతో  కలసి ప్రధానిని కలసి ఒక వినతిప్రతం సమర్పించాలనుకున్నారు.  ఈ మేరకు ప్రధాని కార్యాలయానికి అభ్యర్థన పంపారు. ఈ అభ్యర్థనను ప్రధాని కార్యాలయం తిరస్కరించినట్లు సమాచారం.

ప్రధాని ఆ రోజు చాలా కార్యక్రమాలలో పాల్గొంటున్నారని,  అఖిల పక్ష ప్రతినిధి బృందాన్ని కలుసుకునేంత  తీరికలేదని శనివారం రాత్రి పొద్దుపోయాక ముఖ్యమత్రి కార్యాలయానికి సమాచారం అదించినట్లు తమకు తెలిసిందని కాంగ్రెస్ నేత ఒకరు చెప్పారు.

 అఖిల పక్షాన్ని వెంటసుకుని ముఖ్యమంత్రి  కెసిఆర్ ప్రధాని కలవానుకోవడం ఇది రెండో సారి. మొదటి సారి ఏకంగా ఆయన ఢిల్లీ వెళ్లాలనుకున్నారు. అపుడు కూడా అది సఫలం కాలేదు. ఇపుడు ముస్లిం రిజర్వేషన్ల మీద  ప్రధానిని కలవానుకున్న ముఖ్యమంత్రి ప్రయత్నం కూడా సఫలం కాలేదు.

ఇది ముఖ్యమంత్రిని ఇరుకున పెట్టేవిషయం కాంగ్రెస్ శాసన సభ్యులొకరు వ్యాఖ్యానించారు.

ఇంతవరకు ఆంధ్ర ముఖ్యమంత్రినే  ప్రధాని కలుసుకోవడం లేదనుకున్నారు. ఇపుడు తెలంగాణా ముఖ్యమంత్రిని కలుసుకునేందుకు  ప్రధాని సుముఖంగా లేరని అర్థమయిందని ఆయనచెప్పారు.

ఇది  ఇలాంటే, ముస్లింలకు రిజర్వేషన్లి వ్వడాన్ని బిజెపి వ్యతిరేకిస్తున్నది.  ఈ విషయాన్ని బిజెపి జాతీయ పార్టీకి, ప్రధాని కి కూడ చేరవేసిందని,  ఇపుడు అఖిల పక్షం అజండాలో ముస్లిం రిజర్వేషన్ల అంశం కూడా ఉండటంతో ప్రధాని కార్యాలయాన్ని బిజెపి అలర్ట్ చేసి ఉంటుందని ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

ఏమయినా సరే ముఖ్యమంత్రి విజ్ఞప్తిని ప్రధాని తోసిపుచ్చడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమయింది.

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page