ఆయన కేవలం గోరు వెచ్చని నీరు మాత్రమే సేవిస్తారు
ప్రధాని నరేంద్రమోడీ దుర్గా నవరాత్రి ఉపవాస దీక్ష చేపట్టారు. గురువారం నుంచి తొమ్మిది రోజుల పాటు ఆయన ఈ దీక్ష చేస్తారు. దీక్ష కాలంలో ఆయన దుర్గామాతకు పూజలు చేస్తారు. తొమ్మిది రోజులు కఠిన ఆహార నియమాలు పాటిస్తారు. కేవలం గోరు వెచ్చని మంచినీటిని మాత్రమే తీసుకుంటారు. ఆయన నవరాత్రి ఉపవాస దీక్ష ని 40ఏళ్లుగా పాటిస్తున్నారు. నవరాత్రి ఉత్సవాల సందర్భంగా మోడీ దేశ ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. ఆయన దీక్షలో ఉన్నప్పటికీ షుడ్యూల్ ప్రకారం అన్నిప్రభుత్వ కార్యక్రమాలకు
హాజరవుతారు. 2014లో ఆయన అమెరికా యాత్రలో ఉన్నపుడు కూడా ఉపవాసం పాటించారు. అపుడు అమెరికా అధ్యక్షుడు బరాక్ ఒబామా ఆయన గౌరవార్థం విందు ఇచ్చినా ఆయన వేన్నీటిని మాత్రమే తీసుకున్నారు. దీక్షలో ఉంటూనే ఐక్య రాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశానికి హాజరయ్యారు.
నవరాత్రి సందర్భంగా ఆయన కామాక్షి(అస్సాం), గుజరాత్ లోని అంబాజీ గుడిలోపూజలాచారించారు. 2001-2004 మధ్య సెక్యూరిటీ సిబ్భందితో కలసి ఆయుధ పూజలు జరిపారు.,
