భారీ డిస్కౌంట్ తో గూగుల్ ‘పిక్సెల్ 2’

భారీ డిస్కౌంట్ తో గూగుల్ ‘పిక్సెల్ 2’

గూగుల్ ప్రతిష్టాత్మకంగా ఇటీవల విడుదల చేసిన స్మార్ట్ ఫోన్ గూగుల్ పిక్సెల్ 2. ఈ ఫోన్ పై ఇప్పుడు భారీ డిస్కౌంట్ ప్రకటించారు. పిక్సల్‌ సిరీస్‌లో వచ్చిన ఈ  స్మార్ట్‌ ఫోన్‌ను ఇపుడు  కేవలం రూ.39,999కే సొంతం చేసుకోవచ్చు. ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ పేరిట ఈ నెల 7నుంచి 9 వరకు నిర్వహించే సేల్‌లో గూగుల్‌ పిక్సల్‌2  (64జీబీ వేరియంట్)  ధరపై మొత్తం రూ.21 వేల భారీ డిస్కౌంట్‌తో  రూ.39,999లకే లభించనుంది.  గూగుల్‌, ఫ్లిప్‌కార్ట్‌ సంయుక్తంగా ఈ భారీ డిస్కౌంట్‌ను అందిస్తున్నాయి.

గూగుల్‌ పిక్సల్‌ 2 అక్టోబర్‌లో  ప్రపంచ వ్యాప్తంగా మార్కెట్‌లోకి వచ్చింది. భారత్‌లో దీని ప్రారంభ ధర రూ.61వేలు. ఫ్లిప్‌కార్ట్‌ ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ సేల్‌లో దీనిపై రూ.11వేల ఫ్లాట్‌ డిస్కౌంట్‌ ఆఫర్‌ చేస్తోంది. క్రెడిట్ / డెబిట్ కార్డు వినియోగదారులకు కార్డు పేమెంట్స్‌ ద్వారా మరో రూ.10వేలు తగ్గింపు. మొత్తంగా రూ.21వేలు తగ్గి రూ.39,999కే ఫోన్‌ ఇది లభ్యం కానుంది. దీంతో పాటు  ఎక్ఛ్సేంజ్‌ ఆఫర్‌ కింద రూ.18 వేలు. అంతేకాదు ఈ ఫోన్‌ కొనుగోలుపై రూ.36,500 బైబ్యాక్‌ గ్యారెంటీని ఫ్లిప్‌కార్ట్‌ అందిస్తోంది. అంతేకాకుండా  ‘బిగ్‌ షాపింగ్‌ డేస్‌’ సేల్‌లో షియోమి ఎంఐ ఏ1, రెడ్ మీ నోట్ 4, ఐఫోన్లపై కూడా  ఫ్లిప్‌కార్ట్‌ ఆఫర్లను అందిస్తోంది.

 

 



 

Sign in to Comment/View Comments

Recent News

Recent Videos

MORE FROM NEWS

Next page