Asianet News TeluguAsianet News Telugu

మండనున్న పెట్రోలు ధర

అంతర్జాతీయ స్ధాయిలో క్రూడియిల్ బ్యారెల్ ధరలు పెరిగితే పెంచుతారు కానీ తగ్గితే మాత్రం తగ్గించరు.

petrol price to go up

రాత్రి నుండి పెంట్రోలు మంట మండనున్నది. లీటర్ పెట్రోల్ ధర సుమారు 3 రూపాయల వరకూ పెరగవచ్చు. ఇప్పటికే లీటర్ పెట్రోల్ ధర సుమారు 70 రూపాయలుంది. దానికి పెరుగనున్న 3 రూపాయలు అదనం.

 

అంతర్జాతీయ స్ధాయిలో బ్యారల్ క్రూడాయిల్ ధర పెరుగుతున్న కారణంగా దేశంలో కూడా పెట్రోలు ధరలు పెంచక తప్పటం లేదు. ఇంకా డీజల్ ధర పెంపు విషయంలో స్పష్టత రాలేదు.

 

అయితే, అంతర్జాతీయ స్ధాయిలో క్రూడియిల్ బ్యారెల్ ధరలు పెరిగితే పెంచుతారు కానీ తగ్గితే మాత్రం తగ్గించరు. ఓ వేళ తగ్గించినా అంతర్జాతీయ స్ధాయిలో తగ్గిన బ్యారెల్ ధర దామాషాలో మాత్రం తగ్గదు. దానికి తోడు ఎన్నో రకాల పన్నలు అదనం. దాంతో మన దేశంలో  పెట్రోలు ధరల మంట ఎప్పటికప్పుడు మండుతూనే ఉంటుంది.

 

పెట్రోల్ బంకుల యాజమాన్యాల సంఘం లెక్కల ప్రకారం తెలుగు రాష్ట్రాల్లో సుమారు 8 వేల పెట్రోలు బంకులున్నాయి. అందులో తెలంగాణలో 3500 బంకులుండగా ఏపిలో 4500 బంకులున్నాయి. వీటన్నింటిలోనూ  పెట్రోలు, డీజల్ కలిపి రోజుకు సగటున 40 లక్షల లీటర్ల వరకూ అమ్మకాలు సాగుతున్నాయి.

 

 

Follow Us:
Download App:
  • android
  • ios