అబ్బే, పరిటాల రవి గుండు కొట్టించలేదు

First Published 8, Dec 2017, 7:43 PM IST
Pawans three day tour in Andhra brings his political ignorance to the fore
Highlights

అభియోగాలు లేకుండా ఉంటే జగన్ కు మద్దతు తెలపడానికి ఎటువంటి అభ్యతరాలు లేవు.

.జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ ప్రతిపక్ష పార్టీకి ఎందుకు దూరంగా ఉంటున్నారో ఈ చెప్పారు. ఈ మూడు రోజుల పర్యటనలో ఆయన టిడిపి కి దగ్గర అనే విషయం మరీ స్పష్టమయింది. లేదంటే తాను టిడిపికి, వైసిపి సమానదూరం అని చెప్పలేకపోయారో ఏమో... మెసేజ్ అయితే, ఆయన టిడిపి మీద అంత కసిగా లేరని అంతా అనుకుంటున్నారు. అదే పవనిజమేమో.

 

అయితే,ఈ రోజు విజయవాడలో చాలా ఆసక్తి కరమయిన అశాలు ప్రస్తావించారు. అయితే, చాలా విషయాలో బాగా అసంబద్ధత కూడా తొంగిచూసింది. ఇదెందుకు జరిగిందో తెలియదు.  జగన్ గురించి, కులాల గురించి, వంగవీటి రంగా హత్య గురించి, అమరావతి గురించి ఆయన అసక్తి కరమయిన,ఆ మాటకొస్తే వివాదాస్పదమయిన వ్యాఖ్యలుచేశారు. తాను కేవలం కాపు నాయకుడిని కాదని, కమ్మలకు దగ్గిరయే అనేందుకు కొంచెం కష్టపడ్డారు. ఈ సారి పర్యటన విశేషం కులాల ఐక్యత గురిం చి మాట్లాడటం. పవర్ కులాల పాలిటిక్స్, పవర్ కోసం పోట్లాడే కులాల మధ్య ఐక్యత ఏమిటి...ఇంత పసితనమా? అమరావతిని రైతుల కన్నీళ్ల మీద కడుతున్నారన్న మనిషి,అమరావతికి ప్రపంచ స్థాయి అయ్యోయోగం ఉందంటున్నారు. కొన్ని అంశాలలో ఆయన మాటలు అవగాహనా రాహిత్యాన్ని బయటపెట్టాయి. ఆయన చేసిన వ్యాఖ్యలు చూద్దాం.

*అభియోగాలు లేకుండా ఉంటే జగన్ కు మద్దతు తెలపడానికి ఎటువంటి అభ్యతరాలు లేవు.

* ప్రపంచ రాజధానికి విజయవాడ సిద్ధంగా లేదు

* కులాలకు మతాలకు అతీతంగా పార్టీలు ఉండాలి. కులాలను విడగొట్టి పాలించు విధానానికి జనసేన వ్యతిరేకo.

* అమరావతి నా ‘హైదరాబాద్’ అనేది తరువాత చెపుతాను. కులాల మధ్య ఐక్యత సాధిస్తే అమరావతి అద్భుతమైన రాజధాని అవుతుంది.

 

*2014 లో ఏ పరిస్థితి లో సపోర్ట్ చేసానంటే చంద్రబాబుకు ఉన్న రాజకీయానుభవం రాష్ట్రానికి అవసరమని. టీడీపీకి మద్దతు చాలా ఆలోచించి ఇచ్చాను..

* వంగవీటి రంగా చనిపోవడం తప్పు.ఆయన తప్పు చేసి ఉంటే చట్టాలు ఉన్నాయి.ఆయనను చంపడం తప్పు.  ఆయనతో సంబంధంలేని కుటుంబాలు రంగ హత్య సమయంలో ఇబ్బంది పడ్డాయి.

* రంగా హత్య అనంతరం కమ్మ వారి ఆస్తుల మీద దాడులు జరిగాయి.

* విజయవాడ ప్రజలు కులం ఉచ్చు నుంచి ఇంకా బయటకు రాలేదు.

*పరిటాల రవి నాకు గుండు కొట్టించాడనేది ప్రచారం మాత్రమే.అ ప్రచారం చేయించింది టీడీపీ వాళ్లే. అవన్నీ నేను మనసులో పెట్టుకోలేదు.అన్ని చేసిన టీడీపీకి ఎందుకు మద్దతు ఇచ్చంనంటే కులాలు ఐక్యత కోసమే మద్దతు తెలిపాను.

 

 

*10 వేల నుంచి 15 వేల మందితో ఒక వర్క్ షాప్ జనవరిలో పెడతాను..

*సమాజం ముందుకు వెళ్లలంటే అంబేద్కర్ ఆశయాలు అవసరం..

 

 

 

 

 

loader