తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై తాజాగా ఒక పోస్టు వాట్సప్ లో హల్ ఛల్ చేస్తోంది.
ఆకాశమే హద్దుగా ‘సృజన’ సోషల్ మీడియాలో చెలరేగిపోతోంది. కొంత మంది అత్యుత్సాహం వల్ల కొన్ని సార్లు అభాసుపాలవుతున్నామొత్తం మీద ఎక్కువ సార్లు పలువురి మెప్పు లభిస్తోంది. తమిళనాడు ముఖ్యమంత్రి పన్నీర్ సెల్వంపై తాజాగా ఒక పోస్టు వాట్సప్ లో హల్ ఛల్ చేస్తోంది.
దివంగత ముఖ్యమంత్రి జయలలిత ప్రజాధరణ పొందేందుకు ఎంత కష్టపడిందో అందరికీ తెలిసిందే. ప్రజల మెప్పు పొందేందుకు ‘అమ్మ’ తన పేరుతో అమ్మ క్యాంటిన్లు, అమ్మ ఆసుపత్రులు, అమ్మ సరకులు, అమ్మ నీరు లాంటివెన్నో ప్రారంభించింది.
అయితే, జయ స్ధానంలో కొత్తగా ముఖ్యమంత్రి బాధ్యతలు స్వీకరించిన పన్నీర్ సెల్వంకు అటువంటి శ్రమ అవసరం లేదన్నది నెటిజన్ల వాదన. ఎందుకంటే, పాలనలో తనదైన ముద్ర వేయకమునుపే పన్నీర్ ప్రజాధరణను చూరగొన్నట్లుగా సదరు పోస్టులో పేర్కొన్నారు.
ఎలాగంటే, పన్నీర్ అనే వంటకం పేరుతో ఎన్నో పదార్ధాలు అత్యంత ప్రాముఖ్యత పొందిన సంగతి అందరికీ తెలిసిందే. పన్నీర్ బట్టర్ మసాలా, పన్నీర్ ఫ్రైడ్ రైస్, పన్నీర్ కడై, పన్నీర్ టిక్కా మసాలా, పన్నీర్ 65 లాంటి ఎన్నో ఐటెమ్స్ అత్యంత ప్రజాధరణ పొందినట్లు నెటిజెన్లు పేర్కొన్నారు.
