బడ్జెట్ ధరలో పానసోనిక్ స్మార్ట్ ఫోన్

First Published 7, May 2018, 3:07 PM IST
Panasonic P95 With 1GB RAM, Face Unlock Launched in India: Price, Specifications
Highlights

రూ.4వేలకే స్మార్ట్ ఫోన్

ప్రముఖ ఎలెక్ట్రానిక్ వస్తువుల తయారీ సంస్థ పానసోనిక్.. భారత మార్కెట్లోకి మరో నూతన స్మార్ట్ ఫోన్ ని విడుదల చేసింది. ‘పీ95’ పేరిట విడుదల చేసిన ఈ  స్మార్ట్ ఫోన్ ధర ని రూ.4,999గా ప్రకటించారు. అయితే ఈ నెల 13వ తేదీ నుంచి 16వ తేదీ వరకు ఫ్లిప్‌కార్ట్ సైట్‌లో జరగనున్న బిగ్ షాపింగ్ డేస్ సేల్‌లో ఈ ఫోన్‌ను రూ.1వేయి తగ్గింపు ధరకు.. అంటే.. రూ.3,999 ధరకే కొనుగోలు చేయవచ్చు.  బ్లూ, గోల్డ్, డార్క్ గ్రే రంగుల్లో లభించనుంది.

పానసోనిక్ పీ95 ఫీచర్లు...
5 ఇంచ్ హెచ్‌డీ డిస్‌ప్లే, 1280 x 720 పిక్సల్స్ స్క్రీన్ రిజల్యూషన్, 1.3 గిగాహెడ్జ్ క్వాడ్‌కోర్ స్నాప్‌డ్రాగన్ 210 ప్రాసెసర్, 1 జీబీ ర్యామ్, 16 జీబీ స్టోరేజ్, 128 జీబీ ఎక్స్‌పాండబుల్ స్టోరేజ్, ఆండ్రాయిడ్ 7.1.2 నూగట్, 8 మెగాపిక్సల్ బ్యాక్ కెమెరా, 5 మెగాపిక్సల్ సెల్ఫీ కెమెరా, 4జీ వీవోఎల్‌టీఈ, బ్లూటూత్ 4.1, 2300 ఎంఏహెచ్ బ్యాటరీ.