విమానం ఎగరడానికి మేకను బలిచ్చారు పాకిస్తాన్ ఏయిర్ లైన్స్ అధికారుల దారుణం రన్ వే పై మేక తలనరికిన అధికారులు
విమానం ఎగరాలంటే ఎక్కడైన ఇంధనం అవసరం.. అదే పాకిస్తాన్ లో అయితే ఓ మేకను బలిస్తే సరిపోతుంది!
వాళ్ల నమ్మకాలు అలాంటివి మరి. రన్ వే నుంచి విమానం టేకాఫ్ చేయడానికి పాక్ ఏయిర్ లైన్స్ సిబ్బంది ఓ మూగ జీవాన్ని బలిచ్చారు.
ఇస్లామాబాద్ విమానాశ్రయంలో ఏటీఆర్-42 విమానం టేకాఫ్ సందర్భంగా పాకిస్థాన్ ఇంటర్నేషనల్ ఎయిర్‌లైన్స్(పీఐఏ) సిబ్బంది మేకను బలిచ్చి దారుణానికి ఒడిగట్టారు.
అంతటితో ఆగకుండా ఆ ఫోటోలను సోషల్ మీడియాలో పెట్టి తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
డిసెంబర్ 7న పాక్‌లో ఏటీఆర్ విమానం కూలి 47 మంది చనిపోయారు. దీంతో ఈ రకం విమానాలను అక్కడ తాత్కాలికంగా నిలుపుదల చేశారు. అనంతరం వాటికి మళ్లీ పరీక్షలు నిర్వహించారు.
తర్వాత ఆదివారం మొదటిసారి ఏటీఆర్ విమాన సర్వీసును ప్రారంభించారు. ఈ సందర్భంగా మళ్లీ విమానానికి ఎలాంటి ప్రమాదం జరగకూడదని విమాన సిబ్బంది మేకను బలి ఇచ్చారు.
అయితే దీనిపై విమాన సంస్థ వివరణ ఇస్తూ మేకను బలి ఇచ్చిన విషయం తమది కాదని, సిబ్బంది వ్యక్తిగత నిర్ణయమని ప్రకటించారు.
