ఒక్కసారి చార్జింగ్ పెడితే వెయ్యి కిలోమీటర్ల ప్రయాణంకొత్త కారును కనిపెట్టిన నెదర్లాండ్ విద్యార్థులుఎలక్ట్రిక్, సోలార్ ద్వారా చార్జింగ్ వెసులుబాటు

పేట్రోల్, డీజీల్ వినియోగం రోజు రోజుకి త‌గ్గుముఖం పడుతున్నది. రానున్న రోజుల్లో అంతా ఎలక్ట్రిక్ కార్లు లేదంటే సోలార్ కార్ల‌కు బాగా డిమాండ్ ఏర్ప‌డ‌నుంది. అందుకు త‌గ్గ‌ట్లు నేడు టెక్ కంపేనీలు కూడా ముందు జాగ్ర‌త్త చ‌ర్య‌లు ప్రారంభించాయి. ఇప్ప‌టికే ప‌లు ర‌కాల ఎల‌క్ట్రీక‌ల్ చార్జీడ్ కార్లు బైక్‌లు వ‌చ్చేశాయి. కానీ ఇప్పుడు వ‌చ్చింది మాత్రం వీట‌న్నింటి కంప్లీట్ భిన్నంగా ఉంటుంది.

ఇప్ప‌టి వ‌ర‌కు ఎలక్ట్రిక్ కార్ల‌కు ఒక్కసారి చార్జీంగ్ పెడితే వంద‌ల కిలోమీట‌ర్లు ప్ర‌యాణించే వాహానాల‌ను చూశాం. కానీ ఈ స్టేల్లా వీ కార్ కు ఒక్క సారి ఫుల్‌ చార్జ్ చేస్తే 1000 కిలో మీట‌ర్ల వ‌ర‌కు ఎలాంటి ఇంధ‌నం అవ‌స‌రం లేదు. దీనిని నెద‌ర్లాండ్ లోని ఎండోవెన్ యూనివ‌ర్సీటీ విద్యార్థులు త‌యారు చేశారు. ఇందులో మ‌రో ఫీచ‌ర్ కూడా ఉంది. ఇది కేవ‌లం క‌రేంట్ తోనే కాకుండా సోలార్ తో కూడా చార్జీంగ్ అవుతుందట. ఇందులో ఐదుగురు ప్ర‌యాణించ‌వ‌చ్చు. గంట‌కు 130 కిలోమీట‌ర్లు వేగంతో స్టేల్లా వీ కార్ ప్ర‌యాణిస్తుంది. అంతేకాదండోయ్ స్మార్ట్ పార్కింగ్ నావిగేష‌న్ సిస్ట‌మ్, చుట్టు ప్ర‌క్క‌ల ఎవ‌రైనా ఈ కారు ద‌గ్గ‌ర‌గా వ‌స్తే వార్నింగ్ కూడా ఇస్తుంది. మనదేశంలో ఈ కారు రావడానికి ఇంకొంత కాలం పట్టే చాన్స్ ఉందంటున్నారు.