పాదయాత్రకు బ్రేక్.. కోర్టుకు జగన్

First Published 24, Nov 2017, 12:25 PM IST
one more break for ys jagan prajasankalpaytara he attended cbi court today
Highlights
  • సీబీఐ కోర్టుకు హాజరైన జగన్
  • పాదయాత్రకు చిన్న బ్రేక్
  • శనివారం నుంచి తిరిగి ప్రారంభం కానున్న ప్రజా సంకల్పయాత్ర

వైసీపీ అధినేత, ఏపీలో విపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి శుక్రవారం నాంపల్లిలోని సీబీఐ కోర్టుకు హాజరయ్యారు. అక్రమాస్తుల కేసులో జగన్.. ప్రతి శుక్రవారం సీబీఐ కోర్టుకు హాజరౌతున్న సంగతి తెలిసిందే. కాగా.. ప్రస్తుతం జగన్.. ప్రజా సంకల్పయాత్ర పేరిట పాదయాత్ర చేస్తున్నారు. ఈ పాదయాత్ర కోసం.. కోర్టులో హాజరుకావడానికి మినహాయింపు కోరగా.. కోర్టు తోసిపుచ్చింది. దీంతో.. ఆయన ప్రతి శుక్రవారం కోర్టుకు హాజరౌతున్నారు.

 ప్రజా సంకల్పయాత్ర లో జగన్  16రోజుల్లో 200కిలోమీటర్ల పైగా నడిచారు. కోర్టుకు హాజరు కావడం నేపథ్యంలో ఆయన పాదయాత్రకు స్వల్ప ఆటంకం ఏర్పడింది. శనివారం నుంచి ఆయన తిరిగి తన పాదయాత్రను కొనసాగిస్తారు. జగన్ తన  పాదయాత్రను నవంబర్ 6వ తేదీ ప్రారంభించగా.. ఆయన కోర్టుకు హాజరవ్వడం ఇది మూడోసారి.

 

loader