( వీడియో) ఆ రియాక్టర్లను మనకెందుకు తగలగడుతున్నారో తెలుసా

nuclear power plans rob our lands create jobs in US and Japan
Highlights

నష్టాల్లో కష్టాల్లో ఉన్న తోషిబా కంపెనీ రియాక్టర్లను ఇండియాలో అమ్మి బాగుపడాలనుకుంటా ఉంది.అమెరికా, జపాన్ కి లాభాలు, ఉద్యోగాలు; ఇక్కడి రైతులకు కష్టాలు, త్యాగాలు

న్యూక్లియర్ పవర్ ప్లాంట్ లను  భారత్ కు   ఎందుకు తగలగడ్తున్నారో తెలుసా...అమెరికాలో, జపాన్ లలో ఉద్యోగాలు పెంచుకునేందుకు.

 

నిరుద్యోగం భారం భరించలేకపోతున్న అమెరికా, జపాన్ ప్రభుత్వాలు రియాక్టర్లను  తయారుచేసి వాటినిభారత్ వంటి దేశాలకు అమ్మి  యువకులకు ఉద్యోగాలు సృష్టించి వారిని సంతృప్తి పర్చాలనుకుంటున్నాయి. కంపెనీలను నష్టాల నుంచి కాపాడుకోవచ్చు.

ఇఎఎస్ శర్మ

ఈ విషయాన్ని ప్రముఖ పర్యావరణ ఉద్యమకారుడు, కేంద్ర మాజీ ఇంధన  కార్యదర్శి ఇఎఎస్ శర్మ చెబుతున్నారు.

 

“ఇండియా న్యూక్లియార్ ప్లాంట్ ల కోసం ఆరు రియాక్టర్లను కొనుగోలు చేస్తే అమెరికా, జపాన్ లలో వేలాది ఉద్యోగాలొస్తాయి. వాటిని కొన్న పాపానికి, ఇక్కడ మనరైతులు న్యూక్లియాన్ పవర్ ప్లాంట్లకు భూములు కోల్పోయి బతుకు దెరువు పొగొట్టుకోవలసివస్తున్నది. ఇదిరైతులొక్కరి సమస్యేకాదు. వాళ్ల వ్యవసాయ భూములు నాశనమయితే, మనందరికి, ఆహార భద్రత పోతుంది,” అని ఆయన హెచ్చరించారు.

 

శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ న్యూక్లియార్ పవర్  ప్రాజక్టు రైతులనుంచి భూములు కాజేసేందుకు, అక్కడ ఇతర కార్యక్రమాలకు భారీ గా నిధులు ఖర్చు చేస్తున్న నేపథ్యంలో కేంద్ర, రాష్ట్రాలకు ఒక లేఖ రాస్తూ,  ఈ కార్యక్రమాల మీద ప్రజల డబ్బులు తగలేయవద్దని, అన్ని కార్యకలాపాలను  నిలిపివేయాలని ఆయన కోరారు.

 

ఈ ప్లాంట్ మాకొద్దు, మా పచ్చని భూములను మాకొదిలేయండని కొవ్వాడ ప్రాంతరైతులు డిమాండ్ చేస్తున్నారు. ఇక్కడ ఉండే జలవనరులు మాయమయితే, తమ బతుకు దెరువు పోతుందని ఆ ప్రాంత మత్స్యకారులు  కూడా మొత్తుకుంటున్నారు.

 

అసలు ఈ ప్లాంట్ సకాలంలో పూర్తయ్యే అవకాశాలు కూడా లేవని తొందరపడుతున్న భారత ప్రభుత్వానికి  ఆయన సూచనలిచ్చారు.

 

ఈ ప్లాంటుకు రియాక్టర్లు సరఫరా చేయాల్సిన  వెస్టింగ్ హౌస్-తోషిభా కంపెనీ  డబ్బు కసాల ఎదుర్కొంటూ ఉంది. అందువల్ల  సకాలంలో కొవ్వాడ ప్లాంటుకు రియాక్టర్లు సరఫరా చేసే గ్యారంటీ కూడా లేదని ప్రధాన మంత్రి కార్యాలయం ప్రిన్సిపల్ కార్యదర్శికి, అణు విద్యత్ శాఖ కార్యదర్శికి శర్మ లేఖలు రాశారు.

 

 ఈ లేఖల విషయాలను ఆయన పత్రికలకు వెల్లడించారు.

 

“రియాక్టర్ల ను సరఫరా చేసే గ్యారంటీయే లేనందున, ఇపుడు ప్రభుత్వాలు నిధులు ఖర్చుచేయడం, భూముల కోసంరైతులను, మత్స్య కారులను వేధించడం మానుకోవాలి,” అని ఆయన సలహా ఇచ్చారు.

 

“ ఈ పరిస్థితులలో  భారత అణు విద్యత్ సంస్థ  నిర్మాణం కొనసాగిస్తే, ప్రాజక్టు జాప్యమయి వ్యయం విపరీతంగా పెరిగిపోయే ప్రమాదం ఉంది. అపుడు, ఇపుడు చవక అనుకున్న అణువిద్యత్ ధర కూడా బాగా పెరిగిపోతుంది,”అని ఆయన హెచ్చరించారు.

 

దానికితోడు, రియాక్టర్ల కొనుగోలులో భారత అణువిద్యుత్ శాఖ కాంపిటీటివ్ బిడ్డింగ్ కు పోలేదని, దీని వల్ల ఈ వ్యవహారం అవినీతి మయవుతుందని కూడా ఆయన అనుమానం వ్యక్తం చేశారు.

 

ప్రపంచమంతా అణురియాక్టర్లను గుమ్మరించి కష్టాలనుంచి బయటపడేందుకు  తొషిబా  ప్రయత్నిస్తూ ఉంది.

 

ఇదిగో  ఈ వీడియో చూడండి. తోషిబా నష్టాలు.

 

తోషిబా కష్టాల్లో ఉందని మన రైతులు, మత్స్య కారులు  జీవనోపాధి కోల్పోయిత్యాగాలు చేసి  ఆదుకోవాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చెబుతున్నట్లే కదా.దీనిని వ్యతిరేకించాల్సిన అవసరం లేదా?

 

 

 

loader