నోకియా8 వినియోగదారులకు శుభవార్త

First Published 25, Nov 2017, 4:43 PM IST
Nokia 8 Android  Oreo Update Starts Rolling Out
Highlights
  • నోకియా8 స్మార్ట్ ఫోన్ లో ఓరియో అప్ డేట్
  • నోకియా 8 ప్రారంభ ధర రూ.34,790

నోకియా 8 వినియోగదారులకు  శుభవార్త. నోకియా8 ఫోన్ లో 8.0 ఓరియో ఆపరేటింగ్ సిస్టమ్ అప్ డేట్ చేసింది. నోకియా బ్రాండ్‌తో హెచ్‌ఎండీ గ్లోబల్‌ స్మార్ట్‌ ఫోన్లను మార్కెట్లోకి తీసుకొస్తోంది. ఫోన్ ని విడుదల చేసిన సమయంలోనే.. ఎప్పటికప్పుడు కొత్త అప్‌డేట్స్‌ ఇస్తామని  వాగ్దానం చేసింది. ఇందులో భాగంగా నోకియా 8 ఫోన్లకు ఓరియో అప్‌డేట్‌ను ఇస్తున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ చీఫ్‌ జుహో సర్వికాస్‌ ట్విటర్‌ ద్వారా తెలిపారు.

త్వరలోనే నోకియా 2, నోకియా 3, నోకియా 6 స్మార్ట్‌ ఫోన్లకు కూడా ఆండ్రాయిడ్‌ 8.0 ఓరియోతో పాటు ఆండ్రాయిడ్‌ పి అప్‌డేషన్‌ కూడా ఇవ్వనున్నట్లు హెచ్‌ఎండీ గ్లోబల్‌ వెల్లడించింది. ఇక నోకియా 8ను ఈ ఏడాది సెప్టెంబర్‌లో హెచ్‌ఎండీ గ్లోబల్‌ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీని ప్రారంభ ధర రూ.34,790గా ప్రకటించారు.

నోకియా8 ఫోన్ ఫీచర్లు..

5.3 ఇంచెస్ టచ్ స్ర్కీన్ 
2.5 గిగాహెడ్జ్‌ ప్రాసెసర్‌ 
4జీబీ ర్యామ్‌ 
64జీబీ అంతర్గత మెమొరీ 
 13 మెగాపిక్సెల్‌ డ్యుయల్‌ కెమెరా 
 3090 ఎంఏహెచ్‌ బ్యాటరీ సామర్థ్యం

loader