Asianet News TeluguAsianet News Telugu

బిజేపి నా పార్టీ కాదు అని ఉద్వేగానికి లోనైన వెంక‌య్యనాయుడు

  • నామినేషన్ వేసిన తరువాత  ఉద్వేగానికి లోనైనా వెంకయ్య నాయుడు
  • బిజేపి పార్టీ వీడుతున్నందుకు బాధగా ఉంది.
  • పార్టీ వ్యవహారాలు గురించి మాట్లాడటం ఇక కుదరదన్న వెంకయ్య నాయుడు
No more BJP party says Venkaiah naiddu

ఎండిఎ కూట‌మీ నుండి భార‌త‌దేశ ఉప రాష్ట్రప‌తిగా నామినేష‌న్ వేసిన వెంక‌య్య నాయుడు. నామినేష‌న్ త‌రువాత ఆయ‌న కొంత‌ ఉద్వేగానికి లోన‌య్యారు. దాదాపుగా 30 సంవ‌త్స‌రాలుగా బిజేపి పార్టీలో ఉండి ఒక్క‌సారిగా పార్టీ నుండి బ‌య‌టికి రావ‌డం కాస్తా బాధగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. బిజేపి పార్టీ ఇప్ప‌టి వ‌ర‌కు త‌న‌కి అప్పిగించిన ప‌నులు విజ‌య‌వంత‌గా నిర్వ‌హించానని, నేటి నుండి త‌న‌ పాత్ర మార‌బోతుందని ఆయ‌న పెర్కొన్నారు. బిజేపి పార్టీని వీడుతున్నందుకు ఒకింత బాధ‌గా ఉన్న రాజ్యాంగాన్ని కాపాడే బాధ్య‌త నాపై పెట్టినందుకు పార్టీ పెద్ద‌ల‌కు ధ‌న్య‌వాదాలు తెలిపారు.

 అదేవిధంగా త‌న‌కి ఘ‌న‌మైన చ‌రిత్ర ఏమీ లేద‌ని ఆయ‌న తెలిపారు. ఎక్క‌డో మూల‌న ఉంటే నన్ను ఉప రాష్ట్ర‌ప‌తి స్థాయికి పెంచింది నేను న‌మ్ముకున్న పార్టీనే అని ఆయ‌న తెలిపారు. తాను ఉప రాష్ట్ర‌ప‌తి అభ్య‌ర్థిత్వాన్ని అంగీక‌రించ‌డం లేద‌ని వ‌చ్చిన వార్తల‌ను ఆయ‌న ఖండించారు. ఉప రాష్ట్ర‌ప‌తి ప‌ద‌వి ద‌క్క‌డం చాలా గొప్ప‌గా భావిస్తున్న‌ట్లు ఆయ‌న అన్నారు. ఇక మీద‌ట పార్టీ వ్య‌వ‌హారాలు గురించి మాట్లాడ‌టం కుద‌ర‌దు అదే కాస్తా క‌ష్టంగా ఉంద‌ని ఆయ‌న తెలిపారు. వంద కోట్ల మందికి, బిజేపి పార్టీ పాల‌క ప‌క్షానికి, ఇత‌ర ఎండిఎ కూట‌మీ స‌భ్యులు త‌న‌కు మ‌ద్ద‌తు ప‌లికినందుకు ధ‌న్య‌వాదాలు అని ఆయ‌న తెలిపారు.

Follow Us:
Download App:
  • android
  • ios